మన MLA నే, కొట్టండి చప్పట్లు…!!

ప్రభుత్వ  పాటశాలలో సమస్యలు ఎలా ఉంటాయో మనం నిత్యం ఏ  న్యూస్ పేపర్లోనో, టీవీ వార్తల్లోనో చూస్తూనే ఉన్నాం. చదువు పరిస్థితి ఒకవైపు ఐతే,  టాయిలెట్స్ పరిస్థితి  మరీ దారుణం. అందుకే తన నియోజకవర్గంలోని ప్రజలకు, ముఖ్యంగా చదువుకునే పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రాకుడదని అనుకున్నాడు ఆ ఎమ్మెల్యే. ప్రభుత్వ స్కూల్స్ ని పరిశీలించటానికి వచ్చిన ఆ ఎమ్మెల్యే అక్కడి టాయిలెట్స్ నుండి దుర్వాసన రావడంతో ఆయనే వెళ్లి ఆ టాయిలెట్స్ ని శుభ్రం చేశాడు. నాయకుడు అంటే ఇలా ఉండాలని అందరిచే ప్రశంసలు పొందుతున్నాడు.

-858751328187923795032989

ఐదేళ్ళకు ఒకసారి వచ్చే ఎన్నికలలో మీకు అది చేస్తాను, ఇది చేస్తానని మాయమాటలు చెప్పి, ప్రజల ఓట్లతో గద్దెనెక్కి పాలించే నాయకులు ఉన్న నేటి సమాజంలో ఇలాంటి నాయకుడు ఆ ప్రజలకు దొరకటం అదృష్టమేనేమో. ఆంద్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరిజిల్లాలోని పాలకొల్లు ఎమ్మెల్యే  డాక్టర్ నిమ్మల రామానాయుడు తన నియోజకవర్గంలోని స్కూల్స్ పరిస్థితి, అక్కడ చదువులు,పిల్లలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కుంటున్నారో తెలుసుకోవడానికి పాలకొల్లు గవర్నమెంట్ స్కూల్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాడు.
స్కూల్ లోకి ఎంటర్ అవగానే ఆక్కడ ఉన్న టాయిలెట్స్ నుండి భరించలేని దుర్వాసన వచ్చింది. వెంటనే స్కూల్ హెడ్ మాష్టార్ ను, ఇతర టీచర్స్ ను పిలిచి మండిపడ్డాడు. ఇలాగేనా టాయిలెట్స్ ఉంచుకునేదని ఫైర్ అయ్యాడు. అంతటితో ఆగకుండా ఆయనే రంగంలోకి దిగి బ్రష్ పట్టుకొని టాయిలెట్స్ ని శుభ్రం చేశాడు, ఆ తర్వాత చీపురు తీసుకొని చెత్తగా ఉన్న గచ్చుపై నీళ్ళు చల్లి క్లీన్ చేశాడు. ఇంకోసారి ఇలా రిపీట్ అయితే బాగోదని వార్నింగ్ ఇచ్చాడు. కాగా ఆ ఎమ్మెల్యే చేసిన పనిపట్ల అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

Comments

comments

Share this post

scroll to top