కూల్ గా ఉండే “మిథాలీ రాజ్” ట్విట్టర్ లో ఎందుకు ఫైర్ అయ్యారో తెలుసా..? ఫ్లిప్ కార్ట్ స్పందన ఇదే..!

భారత మహిళా క్రికెట్ జట్టుకి ఇటీవలి కాలంలో ఎంత ఆదరణ లభించిందో కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు అనుకుంట. కెప్టెన్ “మిథాలీ రాజ్” ను మన ప్రభత్వం కోటి రూపాయల ప్రైజ్ మనీ ఇచ్చి సత్కరించింది. వరుస అర్ధ శతకాలతో టోర్నమెంట్ లో దూసుకుపోయింది మిథాలీ రాజ్. ఫైనల్ వరకు జట్టుని నడిపించిన తీరుకి అభిమానులందరూ ఫిదా అయిపోయారు. ఉమెన్స్ క్రికెట్ లో అత్యధిక పరుగులు సాధించిన ఘనత “మిథాలీ రాజ్” సాధించింది.

ప్రస్తుతం హైదరాబాద్ లోని తన నివాసంలో రిలాక్స్ అవుతున్నారు “మిథాలీ రాజ్”. తన పాత మ్యాచ్ల వీడియోలు చూస్తూ టైం పాస్ చేస్తున్నారంట “మిథాలీ రాజ్”. ఆటలో చాలా కూల్ గా ఉండే మిథాలీ, ఒక చిన్న విషయానికి ఫైర్ అయ్యి అందరిని షాక్ కి గురిచేసారు. తన మొబైల్ తో ఓ సమస్య వచ్చి పడింది అంట మిథాలికి. అదే విషయాన్నీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. ఇంతకీ ఏమైందో వివరాలు చూడండి!

ట్విట్టర్ లో సెల్ఫీ వీడియోలో, తన ఫోన్ బాటరీ సమస్య గురించి చెప్పుకొచ్చారు. వీడియోలో ఆమె ఏమన్నారంటే…

“నేను ఆడిన మ్యాచ్లను మళ్లీ మళ్లీ చూస్తుంటే. ఎందుకంటే అవి నా తప్పులను సరిదిద్దుకోవడానికి ఉపయోగపడతాయి. అందుకే టైం దొరికినప్పుడల్లా నా ఫోన్ లో నేను ఆడిన మ్యాచ్ లు చూస్తూ ఉంటా. కానీ నా ఫోన్ 7 – 8 ఓవర్ల వరకు చూడగానే ఆఫ్ అయిపోతున్నాయి. అది చాలా ఇబ్బందిగా ఉంది. టెక్నాలజీ ఉంది కూడా..బాటరీ నన్ను మ్యాచ్ లు చూసుకోనివ్వట్లేదు”

కనీసం ఒక ఇన్నింగ్స్ చూసే వరకైనా నా ఫోన్ బాటరీ లైఫ్ ఉంటె బాగుండు!

ఆమె వీడియో పెట్టిన కొద్దిసేపటికే సహాయం చేయడానికి ఫ్లిప్కార్ట్ ముందుకొచ్చి ఓ ట్వీట్ చేసింది. ట్వీట్ లో ఏమన్నారంటే..
“మిథాలీ గారు..మేము మీ ఫాన్స్, మీ దారిలో ఏది అడ్డు రావద్దు అనుకుంటాము. ఆగష్టు 1 న రెండు గంటలకు మీకోసం ఓ కొత్త ఫోన్ రానుంది.”

Comments

comments

Share this post

scroll to top