ఇండియా మహిళల క్రికెట్ టీం కెప్టెన్ “మిథాలీ రాజ్” కు బంపర్ ఆఫర్..! ఫైనల్ గెలుస్తే ఎవరు ఏం ఇవ్వనున్నారో తెలుసా?

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో నేడు కీలక మ్యాచ్ జరగబోతోంది. ఇంగ్లండ్‌తో ఇవాళ జరగబోతున్న ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కు పేరుతో పాటు కారు కూడా రానుంది. మాజీ క్రికెటర్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మాజీ చైర్మన్ చాముండేశ్వరినాథ్ టీమిండియా ఉమెన్స్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కు ఓ ఆఫర్ ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే ఆమెకు బీఎండబ్ల్యూ కారును బహుమానంగా ఇస్తానని ప్రకటించారు. అంతేకాదు, ఆ కారును సచిన్ చేతుల మీదుగా ఇప్పించే యోచనలో ఉన్నట్లు చాముండేశ్వరి నాథ్ తెలిపారు.

గతంలో కూడా రియో ఒలింపిక్స్‌లో సత్తా చాటిన భారత క్రీడాకారిణులు పీవీ సింధు, రూపా కర్మాంకర్, సాక్షి మాలిక్‌కు చాముండేశ్వరినాథ్ బీఎండబ్య్లూ కార్లను సచిన్ చేతులు మీదుగా ఇప్పించిన సంగతి తెలిసిందే. గెలిచిన క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఇలా బహుమతి ప్రదానం చేస్తున్నట్లు చాముండేశ్వరినాథ్ తెలిపారు.

Comments

comments

Share this post

scroll to top