ఆ పాకిస్తానీ జర్నలిస్ట్ ప్రశ్నకు “చెంప పగిలెలా సమాధానం” ఇచ్చింది “మిథాలీ రాజ్”..! ఇంతకీ ఏమడిగాడు..?

లండన్ పాకిస్థాన్ విలేకరికి టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ దిమ్మదిరిగే షాకిచ్చింది. దీంతో అతడు ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. రేపటి (జూన్ 24) నుంచి మహిళల వన్డే ప్రపంచకప్-2017 ప్రారంభం కాబోతోంది. తొలి మ్యాచ్ ఆతిథ్య ఇంగ్లండ్-భారత్ మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్ల కెప్టెన్లకు నిర్వాహకులు ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన మీడియా సిబ్బంది కూడా హాజరయ్యారు.

ఈ ప్రత్యేక విందు కార్యక్రమం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాకిస్థాన్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు మిథాలీ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

రిపోర్టర్: భారత్, పాక్ జట్లలో మీ అభిమాన క్రికెట్ ఆటగాడు ఎవరు?
మిథాలీ: ఎవరైనా ఆటగాడిని మీ అభిమాన మహిళా క్రికెటర్ ఎవరు అని మీరు అడగగలరా? ఎవరైనా ప్రశ్న అడిగేటప్పుడు మీ అభిమాన క్రికెటర్ ఎవరు? అని అడుగుతారే తప్ప, మీ అభిమాన మహిళా క్రికెటర్ ఎవరు? అని అడుగుతారా? ఎక్కడైనా? ఇండియాలో మెన్స్ క్రికెట్‌కు ఉన్న క్రేజ్ మాకు లేదు. మ్యాచ్‌లు ఆడినా మేము టీవీల్లో కనిపించము.

source: abn

Comments

comments

Share this post

scroll to top