“శ్రీనువైట్ల – వరుణ్ తేజ్” కాంబినేషన్ లో విడుదలైన “మిస్టర్” హిట్టా.? ఫట్టా.? స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో)

Movie Title (చిత్రం): మిస్టర్ (Mister)

Cast & Crew:

 • నటీనటులు: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, హెబా పటేల్ తదితరులు
 • సంగీతం: మిక్కీ జె మేయర్
 • నిర్మాత: నల్లమలుపు బుజ్జి, టాగోర్ మధు
 • దర్శకత్వం: శ్రీను వైట్లా

Story:

పిచ్చయ్య నాయుడు (చై) (వరుణ్ తేజ్) ఒక ట్రవెల్లెర్. లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఓ సారి “స్పెయిన్” ట్రిప్ కు వెళ్ళినప్పుడు “మీరా” (హేభ పటేల్) తో పరిచయం అవుతుంది. పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఇంతలో వాళ్ళ కుటుంబంలో కలహాలు రేగడంతో అతను తిరిగి ఇండియా కు రావాల్సి ఉంటుంది. వాళ్ళ సొంత ఊరికి వెళ్తాడు. అక్కడే పల్లెటూరి అమ్మాయి అయిన “చంద్రముఖి” (లావణ్య త్రిపాఠి) కలుస్తుంది. ఆ అమ్మాయితో కూడా ప్రేమలో పడతాడు “చై”. ఇద్దరిలో ఎవరి ప్రేమ స్వచ్ఛమైందో, నిజమైందో తెలుసుకుందాం అనుకుంటాడు. చివరికి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అనేది తెలియాలి అంటే “మిస్టర్” సినిమా చూడాల్సిందే!

Review:

“వరుణ్ తేజ్” ఇప్పటివరకు చేయని లవర్ బాయ్ పాత్రలో చిత్రం “మిస్టర్”. లైఫ్ ని ఎంజాయ్ చేసే యువకుడిగా “వరుణ్ తేజ్” ఆడియన్స్ ను మెప్పించాడు. హెబా, లావణ్య గ్లామర్ ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. “శ్రీను వైట్ల” అంటే కేవలం కామెడీ సినిమాలే కాదు. లవ్ రొమాంటిక్ ఎమోషనల్ సినిమాలు కూడా తీయగలరు అని నిరూపించుకున్నారు “శ్రీను వైట్ల”. సినిమాకు  కథ, స్క్రీన్ప్లే, ఫామిలీ బాక్గ్రౌండ్ మంచి ప్లస్ అయ్యాయి. అందరు పెద్ద పెద్ద నటులతో, మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమా తప్పక ఆకట్టుకుంటుంది. మిక్కీ మ్యూజిక్ మాత్రం రొటీన్ గా ఉంది!

Plus Points:

 • వరుణ్ తేజ్ యాక్టింగ్
 • హెబా, లావణ్య గ్లామర్
 • స్టోరీ
 • ఫామిలీ బాక్గ్రౌండ్
 • ఎమోషనల్ సీన్స్
 • కామెడీ

Minus Points:

 • సాగదీసిన సెకండ్ హాఫ్
 • మిక్కీ రొటీన్ మ్యూజిక్
 • రొటీన్ ఫైట్ సీన్స్

Final Verdict:

చాలా రోజుల తరవాత కామెడీ స్టోరీతో కాకుండా లవ్ స్టోరీ తో ముందుకి వచ్చాడు “శ్రీను వైట్ల”. వరుణ్ తేజ్ నటన కోసం. హెబా, లావణ్య గ్లామర్ కోసం. మీకు కాలీ సమయం దొరికితే ఒకసారి వెళ్లి చూసిరావచ్చు ఈ సినిమా. మొత్తం మీద సినిమా యావరేజ్

AP2TG Rating: 2.5/5

Trailer:

Comments

comments

Share this post

scroll to top