భాగ‌స్వామిని ఎంచుకోవ‌డంలో ఈ 6 పొర‌పాట్లు చేయ‌కండి..

పెళ్లిలు స్వ‌ర్గంలో నిర్ణ‌యించ‌బ‌డుతాయంటారు. అదెంత వ‌ర‌కు నిజ‌మో కానీ ఈ కాలంలో మాత్రం అబ్బాయి, అమ్మాయి ఇష్టాయిష్ట‌ాల‌తో నిర్ణ‌యించ‌బడుతున్నాయి. కొన్ని జంట‌ల‌ను చూడ‌గానే చిలుక గోరెంక‌ల్లా.. మ‌రికొన్ని జంట‌లు చూడ‌గానే పెద‌వి విరిచేలా క‌నిపిస్తాయి. ఇలా ఎందుకు జ‌రుగుతుంది.? ఎంపిక‌లో లోప‌మా.. లేక కావాల‌నే అలా పెళ్లి చేసుకుంటున్నారా? పెళ్లాయ‌క ఎందుకు త‌ప్పు తెలుసుకుంటున్నారు. జీవిత భాగస్వామి ఎంపిక‌లో పొరపాట్లు చేయకూడదంటే ఏం చేయాలి..? తెలుసుకుందాం..

ప్రేమ..
పెద్ద‌లు కుదిర్చిన పెళ్లిలో దీనికి చోటు త‌క్కువ‌. అటు ఏడు త‌రాలు ఇటు ఏడు త‌రాలు చూసినా.. చేసుకోబోయే వారిలో  ప్రేమించే మ‌న‌సు లేకుంటే క‌ష్ట‌మే. జీవిత భాగ‌స్వాముల విష‌యంలో ప్రేమ చాలా అవ‌స‌రం. ఆర్థిక‌, స్థితిగ‌తులు, చ‌దువు వీటిని మాత్ర‌మే దృష్టిలో పెట్టుకుని పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు త‌ప్ప‌వు.

hug-and-kiss-of-romantic-couple-in-love
అందం..
పెళ్లి కూతురు చాలా అందంగా ఉంది.. పెళ్లికి ఒప్పుకుంటే పోలా అని చాలా మంది అనుకుంటారు. కానీ అందం అనేది ఒక వ‌య‌సుకు మాత్ర‌మే ప‌రిమితం.. అందులోను అందం ఉన్న వాళ్ల‌కి మాన‌వ‌త్వం ఉంటుంద‌ని, మంచి మ‌న‌సుంటంద‌ని చెప్ప‌లేం. అందం కోసం మిమల్ని ఇబ్బంది పెట్టినా.. మీరు ఇబ్బంది పడ్డా.. సంసారం సాఫీగా సాగదు. సో అందంగా కనిపించే వాళ్లనే పెళ్లి చేసుకోవాలి అనుకోవడం త‌ప్పే.

wedding-photography-8

కుటుంబం..
అమ్మాయికి అబ్బాయి.. అబ్బాయికి అమ్మాయి న‌చ్చితే చాలు పెళ్లికి ఓకే చెప్ప‌వ‌చ్చు. కుటుంబ సభ్యుల ఒత్తిడితో పెళ్లి చేసుకుంటే జీవిత భాగ‌స్వామితో ఆనందంగా ఉండ‌లేరు. స‌ర్థుకుపోయే తత్త్వం  మిమ్మ‌ల్ని మ‌రింత కుంగ‌దీయ‌వ‌చ్చు. వైవాహిక జీవిత‌ము సంతోషంగా ఉండ‌దు.

Maheshwari family in Ye Rishta Kya Kehlata Hai

సక్సెస్..
పెళ్లికి స‌క్సెస్ కి సంబందం పెట్టుకోకూడ‌దు.. స‌క్సెస్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలి అనుకున్నా.. ఆమె నా లైఫ్ లోకి వ‌స్తే స‌క్సెస్ వ‌స్తుంద‌ని భావించి పెళ్లి చేసుకున్నా.. రెండు ఇబ్బందే. స‌క్సెస్ వ‌చ్చే స‌మ‌యానికి వ‌య‌సు మీద ప‌డ‌వ‌చ్చు. శారీర‌క సుఖాన్ని కోల్పోయాక పెళ్లి చేసుకున్న ఇబ్బందే.

20150724190206-success-focus-life-achievements

స‌హాయం
త‌న‌కు ఇంత‌కు ముందు స‌హాయం చేశార‌నో.. లేక త‌నకు స‌హాయంగా ఉంటుంద‌నో పెళ్లి చేసుకోకుడ‌దు. అలాగ‌నీ స‌హ‌యం చేసిన వారిని పెళ్లి చేసుకోకూడ‌ద‌ని కూడా చెప్ప‌డం లేదు. అన్ని సంధ‌ర్భాల‌లో మంచిది కాదు రీల్ లైఫ్ లో మాత్ర‌మే ఇవి వ‌ర్క‌వుట్ అవుతాయి. రియ‌ల్ లైఫ్ లో చాలా క‌ష్టం.

man-woman

ప్రొఫెషన్ కోసం
ఇక చివ‌రిది.. డాక్ట‌ర్ డాక్ట‌ర్ ను .. టీచ‌ర్ టీచ‌ర్ ను.. ఇంజ‌నీర్ ఇంజ‌నీర్ ను ఇలా ప్రోఫెష‌న్ తో సంబంధం ఉన్న‌వారిని మాత్ర‌మే పెళ్లి చేసుకోవ‌డం అస‌లు మంచిది కాదు. జీవితంలో ఒకే ఆలోచ‌న‌లున్నా భిన్న ధృవాలుగా ఉంటార‌న్న‌ది అక్ష‌ర స‌త్యం. సో ఇవ‌న్నీ ఆలోచించి భాగ‌స్వామిని ఎంచుకొండి. హ్య‌పిగా జీవితాన్ని గ‌డిపేయండి.

man-woman-working-together

Comments

comments

Share this post

scroll to top