బ్యాంక్ లో ఆధార్ కార్డ్ ఇస్తున్నారా? అయితే ఇలా రాసి ఇవ్వండి.

గుర్తింపు కార్డుల‌లో కింగ్ ఆధార్ కార్డ్…… బ్యాంక్ లో అకౌంట్ ఓపెనింగ్ మొద‌లు సిమ్ కార్డ్ కొనుక్కునే వ‌ర‌కు ఇదొక్క‌టుంటే చాలు.! ప‌ని సింపుల్ గా  అయిపోతుంది. అంతటి ప‌వ‌ర్ ఉన్న ఆధార్ కార్డ్ ను చాలా ప‌ద్ద‌తిగా ఉప‌యోగించాల‌ని చెబుతున్నారు నిపుణులు లేదంటే అస‌లుకే ఎస‌రు వ‌చ్చే ప్ర‌మాద‌ముంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

ఏ ప‌ని అవ‌స‌రం కోసం ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీని ఇస్తున్నామో..? ఆ జిరాక్స్ మీద ఆ ప‌నిని గురించి క్లుప్తంగా  రాయాలంట‌…ఉదాహ‌ర‌ణ‌కు బ్యాంక్ లో డ‌బ్బుల మార్పు కోసం ఇస్తే…..For demonetization as ID proof Only అని రాయాలంట‌.అదే సిమ్ కార్డ్ కోసం అయితే….For AIRTEL/IDEA/JIO SIM Card As ID Proof Only అని రాయాలంట.!  లేదంటే ఫేక్ రాయుళ్లు మ‌న ఆధార్ కార్డ్ ను ఉప‌యోగించుకొని మ‌న పేరు మీద క్రెడిట్ కార్డులు, ఫోన్ క‌నెక్ష‌న్ల‌కు తీసుకుంటునే ప్రమాదం లేకపోలేదు. అడ్ర‌స్ గా మ‌న ఆధార్ కార్డ్ ను , క‌మ్యూనికేష‌న్ కోసం వారి ఫోన్ నెంబ‌ర్స్ ను ఇచ్చి ప‌ని కానిచ్చేస్తున్నార‌ట‌.!

సో……ఆధార్ కార్డ్ ను దుర్వినియోగం కాకుండా ఉండాలంటే……దాని మీద ఏ ప‌నికోసం వాడుతున్నామో….దానిని క్లుప్తంగా రాస్తే మంచిది. సలహాలు సూచనల కోసం 1947 కు టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయండి.

Comments

comments

Share this post

scroll to top