పులిని దూరం నుండి చూడాలనిపించిందనుకో చూసుకో, పులితో ఫోటో దిగాలనిపించిందనకో కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు ట్రై చెయ్యోచ్చు. సరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తది. ఇది ఓ సినిమా డైలాగ్. అత్యుత్సాహం తో పులి తో సెల్ఫీ దిగిన యువకుడిని మాత్రం పోలీసులు వెంటాడి చుక్కలు చూపించి, లాకప్ లో తోసేసారు.
తాజాగా హైదరాబాద్ కు చెందిన యువకుడు తాను పులితో ఆడుకున్నానని లోకానికి తెలపాలనుకున్నాడు.అనుకున్నదే తడవుగా హైద్రాబాద్ లోని నేషనల్ జూలాజికల్ పార్కులో ఉన్న గొవిందు అనే వ్యక్తి సాయంతో పులి ఉన్న కేవ్ కు వెళ్ళాడు. అక్కడ బోను కడ్డీల్లోంచి దాని కాళ్లు పట్టుకుని లాగుతూ కాసేపు ఫోటోలకు ఫోజులిచ్చాడు. వాటినే ఫేస్ బుక్కులో పోస్టు చేశాడు.
పులితో ఫోటో దిగానన్న ఆనందం అతనికి ఎంతో కాలం నిలవలేదు. పులిని వేధించాడని కొందరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అతనిని అరెస్టు చేశారు. అతనికి సహకరించిన జూ సిబ్బందిపై కూడా కేసు నమోదు చేశారు. ఇలాగే ఓ యువకుడు జంతు ప్రదర్శనశాలలో తాబేలుపై నిలబడి ఫోటోలకు దిగి ఫేస్ బుక్కులో పోస్టు చేసి అడ్డంగా పోలీసులకు బుక్కయ్యాడు. చూశామా, ఆనందించామా అన్నట్టు ఉండాలి కానీ.. సెల్పీ లు బర్ఫీలు అంటే ఇదిగో ఇలాగే ఉంటుంది.
పులి,ఫోటో అంటుంటే యమదొంగ సినిమాలోని ఓ డైలాగ్ గుర్తొస్తుంది. అది మీ కోసం.
CLICK: మరింత సమాచారం కొరకు: