ఉగ్రమూకల భరతం పట్టిన మిరాజ్ 2000 ప్రత్యేకతలు తెలిస్తే గుండెలు ఉప్పొంగుతాయి !!

పుల్వామా ఉగ్రదాడిలో 44 మంది జవాన్లు అమరులవడంతో భారత వాయుసేన ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ను దెబ్బకు దెబ్బ కొట్టింది. పాక్ భూ భాగంలోకి వెళ్లి అక్కడ ఉన్న జైషే మహ్మద్ కు చెందిన మూడు ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. అయితే ఈ దాడిలో మొత్తం 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. అతి వేగంగా వెళ్తూ నిర్దేశిత టార్గెట్లను గురి తప్పకుండా పేల్చడం మిరాజ్ 2000 యొక్క విశిష్టత.


అయితే పాకిస్తాన్ భూ భాగంలోకి వెళ్లి మొత్తం 300కి పైగా ఉగ్రవాదులను హతమార్చింది భారత వాయుసేన. ఈ మెరుపు దాడిలో కీలక పాత్ర పోషించిన మిరాజ్‌ 2000 యుద్ధ విమానాలు… జైషే మహ్మద్‌ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా బాల్‌కోట్‌, ముజఫరాబాద్‌, చకోటిల్లో భారత వైమానిక దళాలు దాడులు చేశాయి. దీంతో మిరాజ్‌ 2000 దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
దసాల్ట్ ఏవియేషన్ లైసెన్స్‌తో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారుచేసిన 12 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిరాజ్-2000 విమానాలు ఈ దాడిలో పాల్గొన్నాయి. మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ఇప్పుడే కాదు… కార్గిల్ యుద్ధంలోనూ కీలక పాత్ర పోషించాయి. ఫ్రాన్స్ కు చెందిన దసాల్ట్ ఏవియేషన్ రూపొందించిన ఈ యుద్ధ విమానాలు చాలా యుద్ధాల్లో తమ సత్తా చాటాయి. 1970లో మిరాజ్ తయారీ ప్రారంభమైంది. ఈ మిరాజ్ ఫైటర్లు మొత్తం మూడు వేరియంట్లలో ఉన్నాయి. సింగిల్ సీటర్, డబుల్ సీటర్ అదే విధంగా మల్టీరోల్ ఫైటర్ జెట్లు ఉన్నాయి.

ఈ విమానంలో తొమ్మిది చోట్లకు ఒకేసారి ఆయుధాలను తీసుకెళ్లొచ్చు. మిరాజ్ 2000లో డిజిటల్ వెపన్ డెలివరీ నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది. పగలు, రాత్రి లేజర్‌ – గైడెడ్ వెపన్స్ ఫైర్ చేయొచ్చు. ఒక్క నిమిషంలో 1,200 నుంచి 1,800 రౌండ్లు ఫిరంగుల్ని పేల్చగలదు. మిరాజ్ 2000 గంటకు 2,530 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది.

ప్రస్తుతం భారత్ వద్ద 2000H మోడల్ 42, 2000TH మోడల్ 8 యుద్ధ విమానాలున్నాయి. మిరాజ్‌కు భారత వైమానిక దళం వజ్ర అని పేరుపెట్టింది. 1999లో కార్గిల్ యుద్ధంలో మిరాజ్ 2000 యుద్ధ విమానం అందించిన సేవలు మర్చిపోలేనివి. ఇప్పుడు అదే మిరాజ్ 2000 యుద్ధ విమానం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపింది.
మిరాజ్ 2000 ను భారత అమ్ముల పొదిలో అద్భుత అస్త్రంగా అభివర్ణిస్తారు. లక్ష్యాలను ఆటోమేటిక్‌గా చేధించే స్పెషల్‌ జెట్‌ ఫైటర్‌ మిరాజ్2000. చీకట్లో సైతం టార్గెట్లు మిస్ కాకుండా పేల్చి తమ పని పూర్తి చేసుకొని తిరిగిరాగలవు. శత్రు స్థావరాలను క్షణాల్లోనే మట్టుపెట్టగల సామర్థ్యం వీటి సొంతం. అయితే ఇప్పటి వరకు మిరాజ్ పాల్గొన్న ఏ యుద్ధంలోనూ గురి తప్పలేదు.

Comments

comments

Share this post

scroll to top