చిన్నారికి కంటి ఆపరేషన్ కి సాయం చేయండి అని కేటీఆర్ కి ట్వీట్ చేస్తే..ఆయన రిప్లై కి హ్యాట్సాఫ్ అంటారు.!

ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు కౌంట‌ర్లు వేయ‌డం.. వారికి పంచ్‌లు విస‌ర‌డంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ది ప్ర‌త్యేక శైలి. అంతేకాదు, ఆయన ప్రాంతాలు, భాష‌లు, వ‌ర్గాల‌కు అనుగుణంగా జ‌నాల‌ను దృష్టిలో ఉంచుకుని ప్ర‌సంగాలు చేయ‌డంలోనూ దిట్ట‌. గ్రామీణుల‌కు త‌గిన‌ట్టుగా తెలంగాణ యాస‌లో ఓ వైపు మాట్లాడుతారు. మ‌రో వైపు అంత‌ర్జాతీయ కంపెనీల‌కు చెందిన ప్ర‌ముఖుల‌తో ఇంగ్లిష్ లో మాట్లాడుతూ, స్పీచ్‌లు ఇస్తూ ఇర‌గ‌దీస్తారు. అంతేకాదు, ఆయ‌న‌లో మ‌రో యాంగిల్ కూడా ఉంది. అదే.. స‌హాయం చేయ‌డం.

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జ‌నాల మ‌ధ్య ఎంత చురుగ్గా తిరుగుతూ వారి స‌మ‌స్య‌ల‌ను వింటూ వాటిని ప‌రిష్కిస్తుంటారో.. అలాగే సోష‌ల్ మీడియాలోనూ ఈయన యాక్టివ్‌గానే ఉంటారు. ముఖ్యంగా ట్విట్ట‌ర్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు ఆయ‌న నెటిజ‌న్ల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటారు. వారి స‌మ‌స్య‌ల‌ను, బాధ‌ల‌ను అర్థం చేసుకుని వాటిని వేగంగా ప‌రిష్క‌రించేందుకు కూడా కృషి చేస్తారు. అందులో భాగంగానే తాజాగా ఓ కుటుంబానికి స‌హాయం చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఓ చిన్నారి కంటి వైద్యానికి అయ్యే ఖ‌ర్చు మొత్తానికి సంబంధించి రూ.2 ల‌క్ష‌లు వ‌చ్చేలా చేశారు.

మ‌హ‌బూబాబాద్ కొత్త‌గూడెం దుర్గారం ప్రాంతానికి చెందిన పి.అశోక్ కుమారుడు పి.రిత్విక్ కంటి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుండ‌గా అదే విష‌యాన్ని ఓ వ్య‌క్తి కేటీఆర్‌కు ట్విట్ట‌ర్ లో తెలిపాడు. దీంతో మంత్రి కేటీఆర్ వేగంగా స్పందించారు. వెంట‌నే సీఎం స‌హాయ నిధి నుంచి రూ.2 ల‌క్ష‌లు శాంక్ష‌న్ చేయించారు. దానికి సంబంధించి ఎల్వోసీ లెట‌ర్‌ను కూడా హాస్పిట‌ల్‌కు పంపారు. దీంతో మంత్రి కేటీఆర్‌కు బాధిత కుటుంబ సభ్యులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఆ చిన్నారికి స‌హాయం అందేలా చేసినందుకు మంత్రి కేటీఆర్‌కు నిజంగా ధ‌న్య‌వాదాలు తెల‌పాల్సిందే.

Comments

comments

Share this post

scroll to top