అక్కా..ఒక్క రుపాయి ఇవ్వూ అంటూ బిచ్చం అడిగిన 10 సంవత్సరాల బాలుడిని బూటు కాలితో తన్నింది ఓ మహిళా మంత్రి. ఆ తర్వాత ఆ బాలుడిని చేతులు పట్టుకొని పక్కకు ఈడ్చి పడేశారు ఆమె సెక్యురిటీ సిబ్బంది. ఈ అమానుష ఘటన మద్య ప్రదేశ్ లో జరిగింది. నవంబర్ 1 న మద్యప్రదేశ్ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మద్యప్రదేశ్ పశుసంవర్థక శాఖ మంత్రి కుసుమ్ మహదలే….ను అక్కా ఒక్క రూపాయి ఇచ్చిపో అంటూ ఆ బాలుడు ప్రాధేయపడ్డాడు..దానికి ఆ మంత్రి అలా బూటు కాలితో తన్ని అక్కడి నుండి వెళ్లిపోయింది.
Watch Video: