పాక్ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ ప‌ద‌వికి ఎస‌రు పెట్టిన మైక్రోసాఫ్ట్ ఫాంట్‌..! ఇంట్ర‌స్టింగ్ స్టోరి.!

విండోస్ పీసీల్లో ఉండే ఫాంట్స్ (Fonts) గురించి కంప్యూట‌ర్ల‌ను వాడే చాలా మందికి తెలుసు. వీటిని వ‌ర్డ్‌, ఎక్సెల్‌, ప‌వ‌ర్‌పాయింట్‌, ఫొటోషాప్‌, క్వార్క్ ఎక్స్‌ప్రెస్ త‌దిత‌ర అనేక అప్లికేష‌న్స్‌లో వాడుతారు. అయితే ఆ ఫాంట్ల‌లో మైక్రోసాఫ్ట్ రూపొందించిన‌ Calibri (కాలిబ్రి) అనే ఫాంట్ కూడా ఉంది. అయితే ఇప్పుడిదే ఫాంట్ పాక్ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ అండ్ ఫ్యామిలీకి చుక్క‌లు చూపిస్తోంది. ఆ ఫాంట్ ఇప్పుడు ఆయ‌న ప‌దవికే ఎస‌రు తెచ్చేలా ఉంది. అత‌న్ని జైల్లో వేసేలా ఉంది. అవును, మీరు విన్న‌ది నిజమే. అదేంటీ… ఆ ఫాంట్ తో న‌వాజ్ ష‌రీఫ్‌కు ఎందుకు ఇబ్బందులు ఎదుర‌వుతాయి..? అనే క‌దా మీరు అడ‌గ‌బోతుంది.. అయితే అది ఎలాగో మీరే కింద చ‌దివి తెలుసుకోండి..!

న‌వాజ్ ష‌రీఫ్ ఇప్పుడే కాదు 1990ల‌లోనే పాక్‌కు ప్ర‌ధానిగా ఉన్నారు. అయితే ఆ స‌మ‌యంలో ఆయ‌న‌, అత‌ని కుటుంబ స‌భ్యులు అక్ర‌మంగా ఆస్తుల‌ను కూడ‌బెట్టార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే విదేశాల్లోని అవెన్‌ఫీల్డ్ అనే అపార్ట్‌మెంట్ ష‌రీఫ్ కూతురి పేరిట ఉంద‌ని విచార‌ణాధికారులు తాజాగా తేల్చారు. ఈ విష‌యాన్ని వారు పాక్ సుప్రీం కోర్టుకు తెలిపారు. అయితే తాను అక్ర‌మంగా ఆస్తుల‌ను కూడ‌బెట్ట‌లేద‌ని, తాను సంపాదించిన సొమ్ముతోనే వాటిని కొన్నాన‌ని ష‌రీఫ్ వాదిస్తూ త‌న నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు య‌త్నిస్తున్నారు.

కాగా ష‌రీఫ్ కూతురు మ‌ర్య‌మ్ న‌వాజ్ 2006లోనే త‌మ ఆస్తుల‌కు సంబంధించిన డిక్లెరేష‌న్‌ను స‌మ‌ర్పించామ‌ని కొన్ని డాక్యుమెంట్ల‌ను విచార‌ణాధికారుల‌కు ఇచ్చింది. దీంతో వారు ఆ పేప‌ర్ల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించి చాలా కీల‌క విష‌యం గుర్తించారు. అదేమిటంటే… స‌ద‌రు డాక్యుమెంట్ల‌లో టైప్ చేయ‌బ‌డి ఉన్న ఆంగ్ల అక్ష‌రాల ఫాంట్ Calibri అని తేల్చారు. నిజానికి ఈ ఫాంట్‌ను మైక్రోసాఫ్ట్ 2007 జనవరి 31 త‌రువాతే త‌న అప్లికేష‌న్ల‌లోకి అందుబాటులోకి తెచ్చింది. అంటే అంత‌కు ముందు ఈ ఫాంట్ విండోస్ పీసీల్లో అందుబాటులో లేదు. కానీ… ఇదే ఫాంట్‌తో వారు డాక్యుమెంట్ల‌ను టైప్ చేశారు అంటే అవి 2007 జ‌న‌వరి 31 త‌రువాత టైప్ చేయ‌బ‌డిన‌ట్టే క‌దా. అంటే అవి 2006లో త‌యారుచేయ‌బ‌డిన డాక్యుమెంట్స్ కావు, ఆ ఫాంట్ వ‌చ్చాక.. అంటే.. 2007 జ‌న‌వ‌రి 31 త‌రువాతే ఏదో ఒక రోజున త‌యారు చేశారు. కానీ 2006లో క్రియేట్ చేసిన‌ట్టు క‌ల‌రింగ్ ఇచ్చారు. దీన్ని అధికారులు ప‌సిగ‌ట్టేశారు. దీన్ని బ‌ట్టి అధికారుల‌కు తెలిసిందేమిటంటే… ఆ డాక్యుమెంట్లు ప‌క్కా ఫోర్జ‌రీ అని గుర్తించారు. ఈ క్ర‌మంలో న‌వాజ్ షరీఫ్‌, అత‌ని కుటుంబ స‌భ్యులు చీటింగ్ చేసిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇక ఈ కేసును అక్క‌డి సుప్రీం కోర్టు ప‌ర్య‌వేక్షిస్తున్న‌ది, త్వ‌ర‌లో తీర్పు వెలువ‌డే అవ‌కాశం ఉంది. ఏది ఏమైనా… మైక్రోసాఫ్ట్ సంస్థ త‌యారు చేసిన ఓ ఫాంట్ దోషుల‌ను ప‌ట్టించింది అంటే… అది విశేష‌మే మ‌రి..!

Comments

comments

Share this post

scroll to top