ప‌రిప‌క్వ‌త (మెచ్యురిటీ) అంటే ఏంటి? అది ఏ వ‌య‌స్సులో వ‌స్తుంది.?( వాస్త‌వ ఘ‌ట‌న ఆధారంగా..)

దీని గురించి వివ‌రించే ముందు ఓ య‌థార్థ క‌థ‌ను చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది. దాని గురించి తెల్సుకుంటే మెచ్యురిటీ విష‌యంలో పూర్తి క్లారిటీ వ‌స్తుంది. ఓ ఆరేళ్ల బాలుడు రోడ్డుకు ఓ వైపు కూర్చున్నాడు…ఇత‌నికి అవ‌త‌లి వైపున్న‌ ఫుట్ పాత్….. పండ్లు, స్వీట్స్ అమ్మే వ్యాపారులతో, అవి కొన‌డానికి వ‌చ్చిన వారితో కిటకిట‌లాడుతోంది. ఓ షాప్ వ‌ద్ద చాలా మంది జ‌నాలు గుమ్మిగూడారు. అది జిలేబీలు అమ్మే షాప్…చాలా గిరాకీ ఉంది, వ‌చ్చిన వారికి వ‌చ్చిన‌ట్టు….ఆ షాప్ వాళ్ళు ఓ పేప‌ర్ లో జిలేబీలు ప్యాక్ చేసి ఇస్తున్నారు. ఈ ప్యాకింగ్ తొంద‌ర‌లో ఓ జిలేబీ కింద‌ప‌డిపోయింది.

jilebi

రోడ్డుకు ఇవ‌త‌లి వైపు కూర్చున్న బాలుడు….వెంట‌నే రోడ్డు దాటి, కింద‌ప‌డ్డ జిలేబీని తీసుకొని దానికంటుకున్న మ‌ట్టిని త‌న ష‌ర్ట్ కు తుడిచి..ఆ జిలేబీని చేత‌ప‌ట్టుకొని రోడ్డు ఇవ‌త‌లి వైపుకొచ్చేశాడు. ఒక్క‌సారిగా ఏదో గుర్తొచ్చిన‌ట్టు…ఆ కుర్రాడు ప‌రిగెత్త‌డం స్టార్ట్ చేశాడు. కొన్ని అంద‌మైన బిల్డింగ్ ల‌ను దాటుకుంటూ త‌నుంటున్న స్ల‌మ్ ఏరియాలోకి వెళ్లి…ఓ పూరి గుడిసె డోర్ తీశాడు. ఇత‌డు క‌న‌బ‌డ‌గానే ఇంట్లో ఆడుకుంటున్న ఒక యేడాది పిల్లాడు( ఇత‌ని త‌మ్ముడు) అన్న‌ను గుర్తిప‌ట్టిన‌ట్టు ఏవేవో సైగ‌లు చేస్తున్నాడు. అత‌డు తీసుకొచ్చిన జిలేబీని రెండుగా తుంచి ఒక‌టి త‌మ్ముడికిచ్చి ఇంకొక‌టి అత‌డు తిన్నాడు.

ప‌రిప‌క్వ‌త…..ఇంత వ‌య‌స్సుకే వ‌స్తుంది అనేది ఉండ‌ద‌ని ఈ వాస్త‌వ‌ఘ‌ట‌న చెబుతోంది. 6 ఏళ్ళ వ‌య‌స్సులో…అదీ ఆక‌లిగా ఉన్న స‌మ‌యంలో , బిచ్చమెత్త‌కుండా, దొంగ‌త‌నం చేయ‌కుండా….ఎవ‌ర్నీ నొప్పించ‌కుండా…కింద‌ప‌డ్డ జిలేబీని తీసుకోవ‌డం ఓ ర‌క‌మైన ప‌రిప‌క్వ‌త‌. కేవ‌లం త‌న గురించి మాత్ర‌మే ఆలోచించ‌కుండా….త‌న త‌మ్ముడి గురించి ఆలోచించి ఆ జిలేబీని ఇంటికి తీసుకురావ‌డం…ఓ ర‌క‌మైన ప‌రిప‌క్వ‌త‌.

Comments

comments

Share this post

scroll to top