మెట్రో రైల్ హైద‌రాబాద్ రోడ్ల‌పై ప‌రుగులు పెట్ట‌నుంది. ముందుగా ఏయే మార్గాల్లో అది రానుందో తెలుసా..?

హైద‌రాబాద్ న‌గ‌ర వాసుల‌కు శుభ‌వార్త‌. ట్రాఫిక్ ర‌ద్దీలో గంట‌లు గంట‌లు వేచి చూసే బాధ ఇక తప్ప‌నుంది. తాము అనుకున్న గ‌మ్య‌స్థానానికి ఎంతో వేగంగా ఇక‌పై చేరుకోవ‌చ్చు. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. ఎందుకో తెలుసా..? ఏమీ లేదండీ… ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి జ‌రుగుతున్నాయిగా మెట్రో రైల్ ప‌నులు. అవును, అవే. అయితే ఆ ప‌నులు పూర్తి కానున్నాయి. చివ‌రి ద‌శ‌లో ఇప్పుడ‌వి ఉన్నాయి. అందుక‌ని త్వ‌ర‌లోనే ఆ రైలులో ప్ర‌జ‌లు ప్ర‌యాణించ‌వ‌చ్చు. దీంతో వారికి ట్రాఫిక్ క‌ష్టాలు తీర‌నున్నాయి.

ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు మెట్రో రైలు అందుబాటులోకి వ‌స్తుంద‌ట‌. ఈ విష‌యాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్వ‌యంగా చెప్పారు. ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో హైద‌రాబాద్ న‌గ‌ర రోడ్ల‌పై మెట్రో రైలు ప‌రుగులు పెడుతుంద‌ని ఆయ‌న అన్నారు. అయితే మెట్రో రైల్ మొత్తం మార్గాల్లో అందుబాటులోకి రావ‌డం లేదు. ర‌ద్దీ ఎక్కువ‌గా ఉన్న మియాపూర్‌-ఎల్బీన‌గ‌ర్‌, నాగోల్‌-హైటెక్‌సిటీ మార్గాల్లో ముందుగా మెట్రోరైల్ అందుబాటులోకి రానుంది. ఆ త‌రువాత ఇత‌ర మార్గాల్లోనూ మెట్రో రైల్ సేవ‌లు ల‌భించనున్నాయి.

మియాపూర్‌-ఎల్బీన‌గ‌ర్ వ‌ర‌కు 29 కిలోమీట‌ర్లు ఉండ‌గా, నాగోల్ నుంచి హైటెక్‌సిటీ వర‌కు 27 కిలోమీట‌ర్ల మెట్రో రైల్ మార్గం ఉంది. మొత్తం రెండూ క‌లిపి 56 కిలోమీట‌ర్ల మార్గం ముందుగా ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది డిసెంబ‌ర్ నెల‌లో ముందు చెప్పిన ఈ రెండు మార్గాల్లో మెట్రో రైల్ ప‌రుగులు పెట్ట‌నుంది. అయితే వాటి స‌మ‌య వేళ‌లు, రుసుం వంటి వివ‌రాలు మాత్రం తెలియ‌రాలేదు. వాటి గురించి త్వ‌ర‌లో వివ‌రాలు తెలిసే అవ‌కాశం ఉంది. ఏది ఏమైనా హైద‌రాబాద్ వాసుల‌కు నిజంగా ఇది శుభ‌వార్తే. ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్న మెట్రో రైల్ సేవలు ఎట్ట‌కేల‌కు ల‌భ్యం కానున్నాయి.

Comments

comments

Share this post

scroll to top