హైదరాబాద్ మెట్రోలో ఫస్ట్ అరెస్ట్..ఆ 65 ఏళ్ల వృద్ధుడు మెట్రోలో ఓ మహిళను అసభ్యంగా..!

హైదరాబాద్ వాసులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మెట్రో రైలు వచ్చేసింది…ప్రధాని మోడి,సిఎం కెసిఆర్ అట్టహాసంగా ప్రారంభించిన నాటి నుండి మెట్రో సేవలు ఇక సామాన్య ప్రజలు వినియోగించుకుంటున్నారు….ట్రాఫిక్,కాలుష్యం అన్ని సమస్యలకు చెక్ పెట్టి..గాల్లో తేలినట్టుందే అనే ప్రయాణం చేయడానికి నగరవాసులందరూ ఉవ్విళ్లూరుతున్నారు.మొదటి రెండు రోజులు తిరనాళ్లను తలపిస్తు కిక్కిరిసిపోయాయి మెట్రో స్టేషన్లు.…కానీ మెట్రో ఎక్కేముందు కొన్ని రూల్స్ పాటించకపోతే  శిక్షలు  తప్పవు అని అధికారులు ముందుగానే హెచ్చరించారు..అందులో భాగంగానే ఫస్ట్ కేస్ నమోదైంది..…

మెట్రో రైలులో ఉప్పల్-నాగోలు మధ్య షీ టీమ్ పోలీసులు ఒకరిని అరెస్టు చేసారు. పోలీసులు నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్‌లో మోబైల్ ఫోన్ తో అమ్మాయిల ఫొటోలు తీస్తూ అడ్డంగా దొరికిపోయాడు నరసింహ అనే వ్యక్తి. పెద్ద అంబర్‌పేట్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్ కు చెందిన ఎన్. నరసింహ(65) విద్యాశాఖలో పనిచేస్తూ రిటైర్డ్‌ అయ్యాడు.ఉప్పల్‌ నుంచి నాగోల్‌ వెళ్తున్న మెట్రోరైలులో తనకు ఎదురు సీట్‌లో కూర్చొని ప్రయాణిస్తున్న మహిళల ఫోటోలను అసభ్యకరంగా తీస్తున్న నరసింహను గుర్తించిన షీ టీమ్ బృందం అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని మొబైల్ ఫోన్‌లో చాలా మంది అమ్మాయిల ఫొటోలు ఉన్నట్లు గుర్తించారు. సెక్షన్-354 కింద నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు…

Comments

comments

Share this post

scroll to top