మెంటల్ టెంక్షన్ ను, స్ట్రెస్ ను దూరం చేసే 5 ఆయుర్వేద పద్దతులు.

ఆరోగ్యకర ఆహార ప్రణాళిక మరియు రోజు వ్యాయామాలను చేయటం వలన మానసిక మరియు శారీరక ఆరోగ్యం బాగుంటుంది. కానీ, కొన్ని రకాల ఆయుర్వేద పద్దతులు కూడా బరువు తగ్గించి, శరీరాన్ని డిటాక్సిఫికేషణ్ కు గురి చేసి మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్నిమెరుగుపరుస్తాయి.అవేంటో మీరే చూడండి …….

ధ్యానం :

“శాన్ ఫ్రాన్సిస్కో” వారు 47 మంది అధిక బరువు గల మహిళలను రెండు బృందాలుగా విడదీసి పరిశోధనలు జరిపారు. ఒక బృందం వారు రోజు ఆరోగ్యకర ఆహార ప్రణాళికతో పాటూ 30 నిమిషాల పాటూ ధ్యానం చేసారు. నాలుగు నెలల తరువాత, ధ్యానం చేసే మహిళలలో ఒక పౌండ్ కొవ్వు పదార్థాలు తగ్గటం వారు గమనించారు. వీరిలో ఒత్తిడి పెంచే హార్మోన్ లు తగ్గటమే దీనికి కారణమని వారు తెలిపారు. మరోవైపు రెండవ బృందం బరువు పెరగటం వారు గమనించారు.

Woman meditating

మసాజ్ :

మసాజ్ వలన రక్తపోటు తగ్గటం, కండరాలు ఆకృతి సంతరించుకోవటం, ఒత్తిడి తగ్గించబడటం మరియు శోషరస ప్రవాహం వంటి లాభాలు కలుగుతాయి. 2009 లో “నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్” వారు జరిపిన పరిశోధనల ప్రకారం, మసాజ్ వలన పేగు కదలికలు సరిగా జరపబడి, మలబద్దకం తగ్గించబడుతుందని పేర్కొన్నారు.

massage

లాఫింగ్ :

మీరు నవ్వినపుడు, ఎండార్ఫిన్లు విడుదల చేయబడతాయి మరియు రక్త ప్రసరణ కూడా ఉద్దీపనలకు గురి చేయబడుతుంది. కామెడీ సినిమా, హాస్య పుస్తకాలను చదవండి ఇతరులతో పంచుకోండి. ఇలా చేయటం వలన మీరు ప్రశాంతతకు లోనవుతారు.

Business people-showing teamwork

వేడి నీరు లేదా అల్లం టీ:ginger-tea-with-hot-water

చల్లటి నీరు తాగటం వలన జీర్ణక్రియకు అంతరాయాలు ఏర్పడవచ్చు. కావున, మీరు ఎక్కువగా వేడి నీటిని తాగాలి లేదా అల్లం టీ తాగండి. భోజన సమయంలో కూడా వేడి నీరు తాగటం మీకు లాభిస్తుంది. అల్లం టీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

శ్వాస వ్యాయామాలు :

ప్రాణాయామ లేదా శ్వాస వ్యాయామాలు ఊపిరితిత్తులలో కార్బన్-డై-ఆక్సైడ్ ను తొలగించి, ఆక్సిజన్ తీసుకునే స్థాయిలను పెంచుతాయి. ఈ ప్రక్రియ మన శరీరానికి కీలక శక్తిని అందిస్తుంది. ప్రాణాయామం చేయటం వలన అంతర్గత అవయవాలు మరియు జీర్ణక్రియ మరియు జీవక్రియ కూడా మెరుగుపడుతుంది.

breath

Comments

comments

Share this post

scroll to top