పెళ్లి చేసుకోబోయే యువ‌కులు క‌చ్చితంగా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏమిటో తెలుసా..?

త్వ‌ర‌లో పెళ్లి జ‌ర‌గ‌బోతుందంటే చాలు వ‌ధూవ‌రుల ఇండ్ల‌లో ఒక‌టే సంద‌డి నెల‌కొంటుంది. కానీ పెళ్లంటే మాట‌లు కాదు క‌దా. ఎన్నో ప‌నులు ఉంటాయి. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు త‌ప్ప మిగ‌తా వారి కుటుంబ స‌భ్యులంద‌రూ ఏదో ఒక పెళ్లి ప‌ని మీద బిజీగా ఉంటారు. ఇక వ‌ధూ వ‌రుల విష‌యానికి వ‌స్తే ఎక్కువ‌గా పెళ్లి దుస్తులు, ఆభ‌ర‌ణాల‌పైనే వారు దృష్టి పెడ‌తారు. అయితే పెళ్లి కూతురి సంగ‌తి ఎలా ఉన్నా త్వ‌ర‌లో పెళ్లి చేసుకునే యువ‌కులు మాత్రం కొన్ని విష‌యాల్లో త‌ప్ప‌నిస‌రిగా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని వాస్తుశాస్త్రం చెబుతోంది. లేదంటే వివాహ అనంత‌రం జీవితంలో ప‌లు స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. అదేంటి, వివాహానికి వాస్తుకు సంబంధం ఏమిటి? అనుకుంటున్నారా? కానీ సంబంధం ఉంది. అదేమిటో ఇప్పుడు చూద్దాం.

getting-married-soon

పెళ్లి చేసుకోబోయే యువ‌కులు న‌లుపు రంగు వ‌స్త్రాల‌కు దూరంగా ఉండాల‌ట‌. కేవ‌లం వ‌స్త్రాలే కాదు, ఇత‌ర ఏ వ‌స్తువైనా న‌లుపు రంగులో ఉంటే దానికి దూరంగా ఉండాల‌ట‌. లేదంటే వైవాహిక జీవితంలో అన్నీ స‌మ‌స్య‌లే ఎదుర‌వుతాయ‌ట‌.

ఒక ప‌డ‌క విష‌యానికి వ‌స్తే పెళ్లి చేసుకునే యువ‌కులు ఎల్లప్పుడూ ద‌క్షిణం లేదా ఉత్త‌రం వైపుకు త‌ల వ‌చ్చే విధంగా నిద్రించాల‌ట‌. దీని వ‌ల్ల అన్నీ శుభాలే క‌లుగుతాయ‌ట‌.

ఒక‌టి క‌న్నా ఎక్కువ త‌లుపులు ఉన్న గ‌దుల్లోనే పెళ్లి కాబోయే యువ‌కులు నిద్రించాల‌ట‌. దీని వ‌ల్ల పాజిటివ్ ఎన‌ర్జీ ఎక్కువ‌గా వ‌స్తుంద‌ట‌.

డార్క్ రంగుల‌తో పెయింట్ వేసిన రూమ్స్‌లో క‌న్నా ప‌సుపు, పింక్ వంటి రంగుల‌తో పెయింట్ వేసిన రూమ్స్‌లో నిద్రిస్తేనే యువ‌కుల‌కు ఎక్కువ లాభం క‌లుగుతుంద‌ట‌. దీని వ‌ల్ల వారి వైవాహిక జీవితంలో స‌మ‌స్య‌లు త‌క్కువ‌గా ఉంటాయ‌ట‌.

పెళ్లి చేసుకోబోయే యువ‌కులు నైరుతి దిశ‌లో త‌ల‌ను పెట్టి నిద్రిస్తే వారి వైవాహిక జీవితం అంత మంచిగా ఉండ‌ద‌ట‌. ఆ దిశ‌లో త‌ల పెట్టి నిద్రించ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని వాస్తు శాస్త్రం చెబుతోంది.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top