మ‌హిళ‌లు, పురుషులు టీష‌ర్ట్స్‌ను తీసే విధానం వేరుగా ఉంటుంది..! ఎందుకో తెలుసా..?

నేటి త‌రుణంలో మ‌హిళ‌లు, పురుషులు అన్ని రంగాల్లోనూ స‌మానంగా దూసుకెళ్తున్నారు. ఆ మాట‌కొస్తే మ‌హిళ‌లే పురుషుల క‌న్నా ఎక్కువ‌గా రాణిస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయితే ఎవ‌రెంత ఎక్కువగా రాణించినా మ‌హిళ‌లు, పురుషుల‌కు మాత్రం కొన్ని తేడాలున్నాయి. అంటే, అదేదో విజ‌యాల ప‌రంగానో, పేరు, ఖ్యాతి ప‌రంగానో, లేదా ఇంకోటేదో లింగ వివ‌క్ష కార‌ణంగానో కాదు లెండి. వారి అల‌వాట్ల కార‌ణంగా ఆ తేడాలున్నాయి. ఇంత‌కీ మ‌హిళ‌లు, పురుషుల‌కు ఉండే అల‌వాట్ల‌లో ఏం తేడాలుంటాయి..? అనేగా మీ డౌట్‌, అయితే ఆ తేడాల‌న్నీ కాదు కానీ ఒక్క స్ప‌ష్ట‌మైన తేడాను ఇప్పుడు తెలుసుకుందాం.

shirts remove

టీష‌ర్ట్స్ లాంటి దుస్తుల‌ను ఇప్పుడు మ‌హిళ‌లు ఎక్కువ‌గా ధ‌రిస్తున్నారు. ఇక యువ‌తీ యువ‌కులైతే ఈ సంఖ్య మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. అయితే వాటిని ధ‌రించ‌డం వ‌ర‌కు ఓకే, కానీ తీసేట‌ప్పుడు ఎలా తీస్తారు..? ఎలా తీయ‌డ‌మేమిటి..? అదొక ప్ర‌శ్నా..? అన‌బోతున్నారా..? అయితే ఆగండి, ఎందుకంటే అలా తీయ‌డంలోనే తేడా ఉంది మ‌రి. ఇంత‌కీ ఆ తేడా ఏమిటంటే…

పురుషులైతే త‌మ టీష‌ర్ట్ లేదా బ‌న్నీనును త‌ల వెనుక నుంచి పైకి లాగి సింపుల్‌గా తీసేస్తారు. అదే మ‌హిళ‌లైతే న‌డుము ద‌గ్గ‌ర చేతుల‌తో ష‌ర్ట్‌ను ప‌ట్టుకుని దాన్ని పైకి లేపి త‌ల పైనుంచి తీసేస్తారు. ఇప్పుడు తెలిసిందా, ఆ తేడా ఏమిటో..! అయితే ఇద్ద‌రూ అలా విభిన్న‌మైన ప‌ద్ధ‌తిలో ష‌ర్ట్స్‌ను ఎందుకు తీస్తారో తెలుసా..? దాని వెనుక ఓ సింపుల్ రీజ‌న్ ఉంది. అదేంటంటే…

సాధార‌ణంగా మ‌హిళ‌లు ధ‌రించే టీష‌ర్ట్స్ బిగుతుగా ఉంటాయి. అలా ఉన్న‌వాటిని పురుషులు తీసిన‌ట్టుగా త‌ల వెనుక చేయి పెట్టి ముందుకు లాగలేం. అలా లాగితే త‌ల ఇరుక్కుపోతుంది. ష‌ర్ట్ రాదు. దీనికి తోడు చంక‌ల వ‌ద్ద మ‌రింత బిగుతై ష‌ర్ట్ అలాగే ఉంటుంది. ఎంత ప్ర‌య‌త్నించినా రాదు. అదే పురుషుల ష‌ర్ట్స్ అయితే స‌హ‌జంగా లూజ్‌గానే ఉంటాయి. అందుకే వాటిని త‌ల వెనుక నుంచి లాగినా వెంట‌నే వ‌చ్చేస్తాయి. సో, ఇద్ద‌రూ టీష‌ర్ట్స్‌ను అలా విభిన్న‌మైన రీతిలో తీయ‌డానికి అస‌లు కార‌ణం అది. తెలుసుకున్నారుగా! న‌చ్చితే షేర్ చేయండి..!

Comments

comments

Share this post

scroll to top