ఫోన్‌లో ఉండే మెమొరీ కార్డు ప‌నిచేయ‌డం లేదా..? అయితే 5 స్టెప్స్ ఫాలో అవ్వండి..!

నేటి త‌రుణంలో ఎన్ని అధునాత‌న ఫీచ‌ర్లు క‌లిగిన స్మార్ట్‌ఫోన్లు వ‌స్తున్నా, ఎంత ఎక్కువ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ వాటిల్లో ఇస్తున్నా మెమొరీ కార్డుల‌కు మాత్రం ఇంకా ఆద‌ర‌ణ త‌గ్గ‌లేదు. ఎందుకంటే ఫోన్‌లో వ‌చ్చే మెమొరీతోపాటు మెమొరీ కార్డును అద‌నంగా ఫోన్‌లో వేసుకుంటే దాంతో ఫోన్ స్టోరేజ్ మ‌రింత పెరుగుతుంద‌నే చాలా మంది ఆలోచిస్తుంటారు. అందుకు అనుగుణంగానే వారు త‌మ ఇష్టానికి త‌గిన‌ట్టుగా వివిధ ర‌కాల కెపాసిటీల్లో ల‌భిస్తున్న మెమొరీ కార్డుల‌ను ఫోన్ల‌లో వేసుకుంటారు. అయితే అంతా బాగానే ఉంటుంది కానీ, స‌డెన్ గా ఒక్కోసారి మెమొరీ కార్డు ప‌నిచేయ‌కుండా పోతుంది. మ‌రి అలాంటి సంద‌ర్భాల్లో ఏం చేస్తే మెమొరీ కార్డును తిరిగి ప‌నిచేయించ‌వ‌చ్చో, య‌థావిధిగా వాడుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. క్లీన్ చేయ‌డం
మైక్రో ఎస్డీ కార్డు పై దుుమ్ము పేరుకుపోవటం వల్ల కూడా అది క్రాష్ అయ్యే అవ‌కాశం ఉంటుంది. ఇలా అయితే మెమొరీ కార్డు ప‌నిచేయ‌దు. అలాంట‌ప్పుడు ఏం చేయాలంటే కార్డును మొత్తని క్లాత్‌తో ఫిజికల్‌గా క్లీన్ చేయాలి. దీంతో అందులో పేరుకుని ఉండే దుమ్ము పోతుంది. ఫ‌లితంగా కార్డు మ‌ళ్లీ ప‌నిచేసేందుకు అవ‌కాశం ఉంటుంది.

2. ఫార్మాట్ చేయ‌డం
మెమొరీ కార్డుల‌కు వైర‌స్ రావ‌డం వ‌ల్ల అవి ఒక్కోసారి క్రాష్ అవుతాయి. అందువ‌ల్లే అవి ప‌నిచేయ‌వు. అలాంట‌ప్పుడు ఆ కార్డుల‌ను ఒక‌సారి ఫార్మాట్ చేస్తే దాంతో వైర‌స్ పోయి అవి మ‌ళ్లీ ప‌నిచేసేందుకు అవ‌కాశం ఉంటుంది.

3. రాంగ్ ఫార్మాట్స్‌
సాధార‌ణంగా ఎవ‌రైనా కొత్త‌గా మెమొరీ కార్డును కొంటే దాన్ని ఒకే ఫోన్‌లో వాడాలి. వేర్వేరు ఫోన్ల‌లో ఈ కార్డుల‌ను మార్చి మార్చి వాడినా మెమొరీ కార్డులు క‌ర‌ప్ట్ అయి ప‌నిచేయకుండా పోతాయి. ఇలాంటి సందర్భాల్లో ఆ కార్డుల్లో డేటా ఉన్న‌ప్ప‌టికీ బ్లాంక్ అని చూపిస్తుంటాయి. అలాంట‌ప్పుడు కార్డుల‌ను ఏ ఫోన్‌లో వాడారో అందులో వేసి వాడితే అవి మ‌ళ్లీ ప‌నిచేసేందుకు అవ‌కాశం ఉంటుంది. లేదంటే ఫార్మాట్ చేసి వాడాలి.

4. ఎజెక్ట్
చాలా మంది మెమొరీ కార్డుల‌ను ఫోన్ నుంచి డైరెక్ట్‌గా తీసేస్తారు. అలా చేయ‌రాదు. వాటిని ముందుగా ఎజెక్ట్ చేయాలి. త‌రువాతే వాటిని ఫోన్ నుంచి తీయాలి. లేదంటే అవి క‌ర‌ప్ట్ అవుతాయి. ఫ‌లితంగా అవి ప‌నిచేయ‌కుండా పోయేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక ఫోన్ల నుంచి మెమొరీ కార్డుల‌ను తీస్తే వాటిని ముందుగా ఫోన్‌లో ఎజెక్ట్ చేయ‌డం మ‌రిచిపోకండి.

5. లాక్
మెమొరీ కార్డుల‌కు కొంద‌రు లాక్ పెడ‌తారు. త‌రువాత ఆ విష‌యం మ‌రిచిపోతారు. అనంత‌రం వాటిని వేరే ఫోన్‌లో వేస్తే ప‌నిచేయ‌వు. అలా గ‌న‌క జ‌రిగి ఉంటే మెమొరీ కార్డును క‌చ్చితంగా ఫార్మాట్ చేయాలి. లేదంటే ప‌నిచేయ‌వు. మెమొరీ కార్డుకు గ‌న‌క లాక్ ఉంద‌ని భావిస్తే దాన్ని ఫార్మాట్ చేసి చూడాలి. దీంతో మెమొరీ కార్డ్ ప‌నిచేసేందుకు అవ‌కాశం ఉంటుంది. లేదంటే కొన్ని సార్లు లాక్ పోకుండా అలాగే ఉంటుంది. అలాంట‌ప్పుడు కార్డును ప‌డేయడం త‌ప్ప చేసేదేం ఉండ‌దు.

Comments

comments

Share this post

scroll to top