మెగాస్టార్ చిరంజీవి పెళ్లి శుభ‌లేఖ .!

మెగాస్టార్ చిరంజీవి జీవితంలో ఫిబ్ర‌వ‌రి 20 మ‌రిచిపోలేన‌టువంటి రోజు..! అవునా..! ఎందుకు..? ఆయ‌నకు పేరు తెచ్చి పెట్టిన ఏదైనా సినిమా ఆ రోజు విడుద‌లైందా..? ఆయ‌నకు సంతానం క‌లిగిన రోజా..? ఆయ‌న బ‌ర్త్ డే అయితే కాదు..! మ‌రింకేమిటి..! ఆయ‌న‌కు సంబంధించిన వారికేదైనా స్పెష‌ల్ డేనా..? ఆగండాగండి..! ఒక్క నిమిషం ఆగండి..! ఎందుకంటే ఇప్పుడు మీరు అనుకున్న‌వి ఏవీ కావు. కానీ వాటి క‌న్నా చాలా మెమొర‌బుల్ డే అది. ఎందుకంటే… అది ఆయ‌న పెళ్లి రోజు కాబ‌ట్టి. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే..!

chiranjeevi-wedding-card

స‌రిగ్గా ఇప్ప‌టికి 37 ఏళ్ల కింద‌ట అంటే… 1980, ఫిబ్ర‌వ‌రి 20న మ‌ద్రాస్‌లో (ఇప్పుడు చెన్నై) ఉద‌యం 10.50 గంట‌ల‌కు చిరంజీవి వివాహం ప్ర‌ముఖ న‌టుడు అల్లు రామ‌లింగ‌య్య కుమార్తె సురేఖ‌తో జ‌రిగింది. కావాలంటే ఆ పెళ్లి శుభ‌లేఖ‌ను, అప్ప‌టి ఫొటోను మీరు కూడా చూడ‌వ‌చ్చు. అయితే వివాహం జ‌రిగిన అదే రోజున సాయంత్రం రిసెప్ష‌న్ కూడా ఏర్పాటు చేశారు. ఈ క్ర‌మంలో సురేఖ‌ను పెళ్లాడాక చిరంజీవి సినిమాల్లో అశేషంగా రాణించారు. అనేక విజ‌యాల‌ను ఆయ‌న అందుకున్నారు. మెగాస్టార్‌గా అభిమానుల గుండెల్లో నిలిచారు. అందుక‌ని ఫిబ్ర‌వ‌రి 20 అనేది ఆయ‌న‌కు క‌చ్చితంగా మ‌రిచిపోలేన‌టువంటి రోజే..! ఈ క్రమంలోనే ఇప్పుడాయ‌న పెళ్లి శుభ‌లేఖ నెట్‌లో ట్రెండ్ అవుతోంది..! చాలా మంది దాన్ని ఆస‌క్తిగా చూస్తున్నారు.

అయితే చిరంజీవి సినిమాల్లోనే కాదు, రియ‌ల్ లైఫ్‌లోనూ ఆయ‌న స్టారే. బ్ల‌డ్ బ్యాంక్, ఐ బ్యాంక్ పేరిట ఎంతో మందికి ర‌క్తం, నేత్రాల‌ను అందిచారాయన‌. మొన్నా మ‌ధ్య జ‌రిగిన మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు షోలో పేద ఆటో డ్రైవ‌ర్ స‌తీష్ కుటుంబానికి స్వ‌యంగా రూ.2 ల‌క్ష‌ల ఆర్థిక స‌హాయం అంద‌జేసి త‌న ఉదార స్వ‌భావాన్ని చాటుకున్నారు. సినిమాల్లో నుంచి రాజ‌కీయాల్లోకి… అటు నుంచి మళ్లీ సుదీర్ఘ విరామం త‌రువాత మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌చ్చినా ఆయ‌న‌కు ఇంకా క్రేజ్ త‌గ్గ‌లేద‌న‌డానికి రీసెంట్‌గా ఆయ‌న తీసిన ఖైదీ నంబ‌ర్ 150 సినిమాయే కార‌ణం..!

Comments

comments

Share this post

scroll to top