మెగా హీరోలకు ఏమైందీ..? కొడుకు ఆడియో ఫంక్షన్ కు నాగబాబు స్టేజ్ కూడా ఎందుకు ఎక్కలేదు??

మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ అంటే..మెగా హీరోలందరూ ఆ ఫంక్షన్ కు అటెండ్ అయి అభిమానులను అలరిస్తారు. అయితే ఈ మధ్య ఆ జోరు కొంచెం తగ్గిందనే చెప్పాలి. ఏ ఫంక్షన్ లో చూడు మెగా ఫ్యామిలీ కి చెందిన హీరో కానీ, ఇతర హీరోగానీ మాట్లాడే సమయంలో ‘పవర్ స్టార్.. పవర్ స్టార్’ అని ఫ్యాన్స్  అరవడం మొదలుపెడుతున్నారు. దీంతో ఆ ఫ్యామిలీ హీరోలతో పాటు, ఫంక్షన్ కు వచ్చిన ఇతర నటులు సహనం కోల్పోయి, ఇబ్బంది పడుతున్నారు. తాజాగా లోఫర్ ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా వచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ది కూడా ఇదే పరిస్థితే.

అయితే మెగా ఫ్యామిలీ ఫంక్షన్ లలో చాలా యాక్టివ్ గా ఉండే మెగాబ్రదర్ నాగబాబు, తన తనయుడు ఆడియో ఫంక్షన్ కు వచ్చి స్టేజ్ మీదికి రాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక తమ కాంపౌండ్ నుండి వచ్చే  హీరోలను ఆశీర్వదించే మెగాస్టార్ చిరు, కేవలం ఒకే ఒక్క బైట్ ఇచ్చి సరిపెట్టేశాడు. నాగబాబు తప్ప మిగతా మెగా హీరోలు ఈ ఫంక్షన్ కు రాకపోవడం, వచ్చిన నాగబాబు సైతం స్టేజ్ మీదకు రాకపోవడం వెనుక సినీ ఇండస్ట్రీ నుండి మూడు  కారణాలు వినిపిస్తున్నాయ్.

14

  •  ఫంక్షన్ కు వచ్చి   సినిమా గురించో, హీరో గురించో మాట్లాడదామనుకుంటే,ఇంతలో పవర్ స్టార్ అని ఫ్యాన్స్  స్టార్ట్ చేస్తారు ఆ సందర్భంలో మాట్లాడడం కష్టమైపోతుందంట.! అందుకే రాకపోవడమే ఉత్తమం అనుకుంటున్నారట!
  •   ఈ ఆడియో వేడుకకు మెగా హీరోలు రాకూడదని పూరిజగన్నాథ్ చెప్పినట్లు కథనాలు వస్తున్నాయి. చిరు 150 వ సినిమా కోసం పూరి చెప్పిన కథ  సెకండాఫ్ నచ్చలేదని చిరు  చెప్పాడు కదా.. అది ఓ  కారణమని అంటున్నాయి సినీ ఇండస్ట్రీ వర్గాలు. (ఇందులో నిజమెంతో ..?)
  • ఇక మెగా ఫ్యామీలో ఏ ఒక్క హీరో హజరుకానీ ఫంక్షన్ కు, స్టేజ్ ఎక్కడం వద్దు అనుకొని నాగబాబు సైలెంట్ అయిపోయారని మరో టాక్ నడుస్తుంది.

Watch Video Chiru On Loafer Audio:

Comments

comments

Share this post

scroll to top