మెగా అల్లుడు కాబోతున్న విజయ్ దేవరకొండ..!!

విజయ్ దేవరకొండ…. టాలీవుడ్ లో ఇప్పుడు భారీ డిమాండ్ ఉన్న హీరో. అర్జున్ రెడ్డి చిత్రం ద్వారా అమ్మాయిలను తన వైపు తిప్పుకున్న విజయ్ దేవరకొండ, గీత గోవిందం చిత్రంతో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ మధ్యనే టాక్సివాలా చిత్రం కూడా హిట్ అవడంతో మనోడికి అదృష్టం గమ్ తో అతుక్కున్నట్టు ఉందని అంటున్నారు. ప్రస్తుతం విజయ్ డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా నోటా చిత్రంతో తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. వరుస చిత్రాలు హిట్ అవడంతో టాలీవుడ్ టాప్ 10 హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. ఇక ఈ హీరోతో భారీ బడ్జెట్ చిత్రాలు చేసేందుకు నిర్మాతలు ముందుకొస్తున్నారు.

ఇదంతా పక్కన పెడితే… విజయ్ దేవరకొండ త్వరలో మెగా ఇంటి అల్లుడు కాబోతున్నాడు. తెలంగాణ యువ హీరో విజయ్ ఇప్పుడు 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. పెద్ద దర్శకులు కూడా విజయ్ తో సినిమా తీసేందుకు సిద్ధపడుతున్నారు. అయితే ఈ యువ హీరోతో బంధుత్వం కలుపుకునేందుకు మెగా ఫ్యామిలీ చూస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక ను విజయ్ దేవరకొండకు ఇచ్చి వివాహం జరిపించాలని భావిస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు చిరంజీవి కుర్రాడు బాగున్నాడు అని సన్నిహితుల దగ్గర అన్న మాట ఇప్పుడు ఫిలిం నగర్ లో వైరల్ అవుతోంది.

పొద్దున్న లేచినప్పటి నుంచి మెగా ఫ్యామిలీకి భజన చేసే భజనకారులు దగ్గర నుంచి ఈ మాటలు వినిపిస్తున్నాయి. కేవలం వీరి వల్లనే ఈ మాట మీడియా సర్కిల్ లో వైరల్ అయ్యింది. అయితే విజయ్ అల్లు అరవింద్ భార్య తరపు బంధువు అని గతంలో ప్రచారం జరిగింది. ఈ నేపధ్యంలో అరవింద్ విజయ్ కు భరోసా ఇచ్చారని టాక్ వినిపించింది.
గతంలో నాగశౌర్య, నిహారిక ప్రేమలో ఉన్నారని అందుకోసమే చిరంజీవి ఛలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చారని వార్తలు వినిపించాయి. కానీ వీటిని నాగశౌర్య, నిహారిక కొట్టి పారేసారు. అసలు నాగశౌర్య ఫ్యామిలీనే మెగా ఫ్యామిలీతో బంధుత్వం వద్దనుకుందట. ఉదయ్ కిరణ్ జీవితంలో జరిగిన సంఘటనలే తమ కుమారుడి జీవితంలో జరిగితే ఏంటి పరిస్ధితి అని నాగశౌర్య తల్లి ఉష వెనకడుగెసిందట. మరి దీనిపై విజయ్ దేవరకొండ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

Comments

comments

Share this post

scroll to top