పేపర్ చదివి కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయిన మోడీ ఏమైందో అని టెన్షన్ టెన్షన్!!

పుల్వామా దాడి తర్వాత దేశంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణం ఎం జరుగుతుందో , ఏం జరగబోతుందో తెలియడం లేదు. భారత్-పాక్ మధ్య యుద్ధం తప్పదేమో అని అనిపిస్తుంది. భారత్ గగనతలంలోకి చొచ్చుకొచ్చిన పాకిస్థాన్ యుద్ధ విమానాలను భారత వైమానిక దళాలు కూల్చేశాయి. దింతో పరిస్థితులు మరింత జఠిలంగా మారాయి.

ప్రధాని మోడీ ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ లోని నేషనల్ యూత్ ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులతో ముచ్చటిస్తున్నారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ మోడీ దగ్గరికి సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి ఓ పేపర్ ఇచ్చాడు. దాన్ని చదివిన మోడీ వెంటనే లేచి కార్యక్రమానికి వచ్చిన అతిధుల దగ్గరికి వెళ్లారు. వారికి వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి హడావుడిగా వెళ్లిపోయారు.

అయితే ఆ పేపర్లో ఏం రాసి ఉందనే విషయంపై సర్వత్రా టెన్షన్ నెలకొంది. ఆ పేపర్ పీఎంవో ఆఫీస్ నుంచి వచ్చిందని భావిస్తున్నారు. లేదంటే అంత హడావుడిగా ప్రధాని ఎందుకు వెళ్తారని అక్కడ ఉన్న అందరూ అనుకున్నారు.
ప్రధాని మోడీ అక్కడి నుంచి నేరుగా భద్రత అధికారుల అత్యున్నత స్థాయి సమావేశానికి వెళ్లారు. భారత గగనతలంలో పాకిస్తాన్ యుద్ధ విమానాలు ప్రవేశించడం, బాంబులు వేయడం దీనికి సమర్థవంతంగా భారత్ ఆ యుద్ధ విమానాన్ని వెంటాడటం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీకి లేఖ అందిందని అందుకే మోడీ మధ్యలోనే వెళ్లిపోయారని అంటున్నారు.

Comments

comments

Share this post

scroll to top