IIT స్టూడెంట్స్ కు పాఠాలు చెప్పే ఈ మాస్టరే,సాయంత్రం చెత్తేరుకునే పిల్లలకూ పాఠాలు చెబుతాడు!

ఓ రోజు రాత్రి డా: వెంటకటేష్ మూర్తి సైకిల్  తొక్కుక్కుంటూ దగ్గర్లోని కబీర్ కాలనికి వెళ్లాడు.  ఈ కబీర్ కాలనీ రోథక్ నగరంలో ఉంది, రోథక్  హర్యానా రాష్ట్రంలోని ఫేమస్ సిటీ . మూర్తి రోథక్ లోని   IIT కాలేజీలో ఫ్రోఫెసర్.  ఆ కాలనీకి వెళ్లిన మూర్తికి అక్కడుంటే ఒకతను కలిశాడు…. అతనితో మాట్లాడుతూనే ఆ బస్తీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం మూర్తి మరోమారు అదే బస్తీకి బయలు దేరాడు తన సైకిల్ మీద…. రోడ్లన్నీ బిజీబిజీగా ఉన్నాయ్..ఎటు చూసిన స్కూల్ బస్ ల హడావుడి, స్కూల్ పిల్లల కోలాహలమే కనిపిస్తుంది.

మూర్తి బస్తీలోకి రాగానే అప్పటి వరకు ఆటలు ఆడుకుంటున్న ఆ బస్తీ పిల్లలు అతని వంక వింతగా చూశారు. పిల్లలూ మీరు స్కూల్ కు వెళ్లరా..? అని అడిగాడు, హు,హు అంటూ మూకుమ్మడి సమాధానం వచ్చింది వారినుండి. ఓ ..అలాగా అంటూ వారిని వెంటబెట్టుకొని ఒక్కొక్కరి ఇంటికి వెళ్లి వారి తల్లీదండ్రులతో మాట్లాడాడు… అందరూ ఒకటే చెబుతున్నారు. పిల్లల్ని చదివించే ఆర్థిక స్థోమత మాకు లేదు, చెత్త ఏరుకుంటే వచ్చే డబ్బులు తినడానికి , జ్వరం వస్తే మందులకే సరిపోవడం లేదు.

దీంతో పిల్లల్ని తనవెంట తీసుకొచ్చి అక్కడి కిరాణా షాప్ లో తలా ఓ చాక్లెట్ కొన్నిచ్చి , వాళ్ళతో ఆడుకుంటూ..వాళ్లకు ఏదో చెప్పి తన  ఉద్యోగానికి వెళ్లాడు. ఆయనంటే ఆ IIT కాలేజ్ లో అందరికీ సదాభిప్రాయం.

murthy

అదే రోజు సాయంత్రం..మళ్లీ అదే బస్తీకి వెళ్లాడు మూర్తి… మూర్తిని చూడగానే పిల్లలందరూ ఆయన చుట్టూ చేరారు..అందరికీ చాక్లెట్స్  తో పాటు, నోట్ బుక్స్, పెన్స్ ఇచ్చి వరుసగా కూర్చొబెట్టాడు….అలా మొదలైన మూర్తి పాఠాలు ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాలు దాటాయ్.. చాలా మంది పిల్లలు ఇప్పుడు స్కూల్స్ లో కూడా జాయిన్ అయ్యారు, పిల్లల తల్లీదండ్రుల ఆటిట్యూడ్ లో కూడా మార్పు వచ్చింది. ఇంతకు ముందు చూట్టూ చెత్తగా చెత్తగా ఉంటే పరిసరాలు కూడా ఇప్పుడు నీట్ గా ఉన్నాయ్.. అన్నింటికి కారణం ఆ IIT మాస్టారే.

రోజూ సాయంత్రం 5:45 నుండి  7:45 పిల్లలకు క్లాస్ చెప్పడం….. మరుసటి రోజు ఉదయం  6:45 నుండి  8:15 వరకు ఆ బస్తీ అంతా తిరిగి పరిశుభ్రత ఎలా ఉంది. పిల్లలు స్కూల్ కు వెళ్లారా..? లేదా అంటూ చెక్ చేయడం రెండు సంవత్సరాలుగా ఆయన దినచర్యలో భాగమైంది.  స్కూల్ అంటేనే భయంతో పారిపోయే పిల్లలను తనవైపుకు తిప్పుకోడానికి  మనోడు వాడిన ఆయుధాలు ఏంటో తెలుసా…? 1) చాక్లెట్లు.. 2) మంచి మంచి కథలు…3) పిల్లల మాతృ భాష బెంగాలీ, స్కూల్లో చెప్పేది హిందీ…సో మూర్తి  బెంగాలీ నేర్చుకొని మీర ఆ పిల్లలకు వాళ్ల మాతృభాషలో టీచ్ చేయడం. ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో 60 మంది పిల్లలు చదువుకుంటున్నారు.

#Hats Off Murthy.

Comments

comments

Share this post

scroll to top