హైదరాబాద్ ట్రాఫిక్ FB పేజీలో ఫన్నీ పోస్ట్స్ పెట్టే Admin H ఎవరో తెలుసా.? అతని గురించి ఆసక్తికర విషయాలివే!

వాహ‌న‌దారులు అన్నాక ఎవ‌రైనా అప్పుడ‌ప్పుడు ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా ప్ర‌యాణిస్తూనే ఉంటారు. వారితోపాటు రెగ్యుల‌ర్‌గా రూల్స్‌ను అతిక్ర‌మించే వారి కోసం ట్రాఫిక్ పోలీసులు కాచుకుని కూర్చుంటారు. అవ‌కాశం దొరికితే చ‌లానాల‌తో వీపు విమానం మోత మోగిస్తారు. దీంతోపాటు ట్రాఫిక్ రూల్స్‌పై అవ‌గాహ‌న కూడా క‌ల్పిస్తారు. అయితే ఒక‌ప్పుడు ఏమోగానీ ఇప్పుడు సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ట్రాఫిక్ పోలీసులు కూడా అదే మాధ్య‌మం బాట ప‌ట్టారు. జ‌నాలు ఎక్కువ‌గా కాల‌క్షేపం చేసే సోష‌ల్ మీడియాలో ట్రాఫిక్ రూల్స్‌, ప్ర‌మాదాల‌పై అవగాహ‌న క‌ల్పిస్తున్నారు. అయితే ఈ విష‌యంలో హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు మిగిలిన వారి క‌న్నా కొంచెం ముందే ఉన్నార‌ని చెప్ప‌వ‌చ్చు.

 

హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసుల‌కు చెందిన అఫిషియ‌ల్ ఫేస్‌బుక్ పేజీని ఫాలో అయ్యే వారికి నిత్యం అప్‌డేట్లు వ‌స్తూనే ఉంటాయి. వాటిలో ట్రాఫిక్ రూల్స్‌, ప్ర‌మాదాల‌పై అవ‌గాహ‌న క‌లిగేలా పోస్ట‌ర్లు, మెసేజ్‌ల‌ను ఉంచుతున్నారు. అయితే అవ‌న్నీ చాలా ఫ‌న్నీగా ఉండ‌డ‌మే కాదు, న‌గ‌ర వాసులను కూడా బాగా ఆక‌ట్టుకుంటున్నాయి. అవి వారికి బాగా రీచ్ అవుతున్నాయి. ఆ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ అయిన కొన్ని పోస్టుల‌ను చూస్తే మీకే అర్థ‌మ‌వుతుంది, అవి ఎంత ఫ‌న్నీగా ఉంటాయో. అయితే అలాంటి ఫ‌న్నీ పోస్టుల వెనుక ఉన్న‌ది ఎవ‌రో తెలుసా..?

 

అత‌ని పేరు హ‌రినాథ్ రెడ్డి. హైద‌రాబాద్ వాసి. వ‌య‌స్సు 27 సంవ‌త్స‌రాలు. 2009లో రిక్రూట్‌మెంట్ ద్వారా పోలీసు డిపార్ట్‌మెంట్‌లో చేరాడు. ఈ క్ర‌మంలోనే 2010లో హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఫేస్‌బుక్ పేజీ అడ్మిన్‌గా అత‌నికి అవ‌కాశం ల‌భించింది. అప్ప‌టి నుంచి Admin H పేరిట ఆ ఫేస్‌బుక్ పేజీలో ఫ‌న్నీ పోస్టుల‌ను అత‌ను పెడుతున్నాడు. పోస్టులు చాలా న‌వ్వు తెప్పించే విధంగా ఉంటుండ‌డంతో జ‌నాలు వాటికి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. దీంతో పోలీసులు చెప్పాల‌నుకున్న ట్రాఫిక్ రూల్స్‌, ప్ర‌మాదాల‌పై అవ‌గాహ‌న మెసేజ్‌లు జ‌నాల‌కు బాగా చేరుతున్నాయి. పోస్టుల‌ను ఇలా పెడితేనే జ‌నాలు చూస్తున్నారు, షేర్ చేస్తున్నారు, క‌నుక‌నే అంద‌రికీ న‌వ్వు పుట్టించే ఆరోగ్య‌క‌ర‌మైన ఫ‌న్నీ మెసేజ్‌ల ద్వారా ట్రాఫిక్ రూల్స్‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నామ‌ని అంటున్నాడు హ‌రినాథ్ రెడ్డి. ఏది ఏమైనా వారు చేస్తున్న ఈ ప్ర‌య‌త్నాన్ని నిజంగా అభినందించాల్సిందే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top