ఆ కలెక్టర్…. ఆ జిల్లా వాసులకు కలెక్టర్ అన్నయ్యా అయ్యాడు.!

ప్రస్తుతం సోషల్ మీడియాకున్న పవర్ మరేదానికి లేదనేది అందరూ ఒప్పుకోవాల్సిన వాస్తవం. అయితే ఫేస్ బుక్ ద్వారా కేవలం లైక్, పోస్ట్, కామెంట్ లతో సరిపెట్టుకోకూడదని భావించాడు ఆ కలెక్టర్. రాజకీయ నాయకుల నుండి ఒత్తిడి పెరిగింది, విమర్శలు మొదలయ్యాయి. ఎవరెంతగా బెదిరించినా,, సామాజిక సమస్యలను రూపుమాపాలనే లక్ష్యంతో, తను ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నాడో, తన వల్ల ఎంత అభివృద్ధి జరుగుతుందో అదే చేశాడు. ‘కలెక్టర్ అన్నయ్య’ గా అందరిచే గొప్పగా పిలవబడుతున్నాడు.

CB1

ఉన్నత చదువులు చదివి, ప్రభుత్వ ఉద్యోగిగా ఉద్యోగం సంపాదించిన 34 ఏళ్ళ ప్రశాంత్ నాయర్ కేరళలోని కోజికోడ్ జిల్లాలో కలెక్టర్ గా నియమితుడయ్యాడు.  జాయిన్ రోజే  తన కంప్యుటర్ ఓపెన్ చేసి.. సోషల్ నెట్ వర్క్ అయిన ఫేస్ బుక్ లో ‘ కలెక్టర్ కోజికోడ్’ పేరుతో ఒక అకౌంట్ క్రియేట్ చేశాడు.
‘కలెక్టర్ కోజికోడ్’ ద్వారా తన స్వప్రయోజాలకోసం ఉపయోగించుకోకుండా తన జిల్లాలోని ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి, వాటికి సొల్యుషన్ వెతికాడు.పాడైన రోడ్లు, చెత్తతో నిండిన కాలువలు, సమయానికి అందని ప్రభుత్వ నిధులు ఇలా ఏ సమస్య ఉన్నా సరే తన ఫేస్ బుక్ అకౌంట్ కి కేవలం ఒకే ఒక్క మెసేజ్ పంపుతే చాలు, ఆ సమస్యను తన కింది సిబ్బంది సహకారంతో లేదా తనే దగ్గరుండి పరిష్కారం అయ్యేలా చేస్తాడు. ఎప్పుడూ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలకు తగ్గ సూచనలిస్తూ ప్రజల అవసరాలను తీర్చడంలో విజయవంతమయ్యాడు.
CB4
కలెక్టర్ ప్రశాంత్ నాయర్ ను ఫేస్ బుక్ లో ఫాలో అయ్యేవారి సంఖ్య1’52,700 పైనే ఉన్నారు. ఒక చోట మంచిగానీ, అభివృద్ధిగానీ జరిగేటప్పుడు ఎన్నో అవాంతరాలు,బెదిరింపులు ఎదురవుతాయి.అది సహజమే.  ప్రశాంత్ నాయర్ కు ఆ జిల్లా రాజకీయనేతల నుండి విమర్శలు వచ్చాయి. నిత్యం ఫేస్ బుక్ లో ఉంటూ కాలం గడిపేస్తున్నాడని అతనిపై చర్యలు తీసుకోవాలని పై అధికారులకు తెలిపారు. ఎన్ని బెదిరింపులు ఎదురైనా మీపని మీరు చేసుకోండి, నా పనిలో నేను ఏ మాత్రం తగ్గనని.. తన సిబ్బందిని  నిత్యం ప్రజలతో మమేకమై ఉండేలా సామాజిక మధ్యామాలలో ఉండాలని తెలిపాడు..
గత కొన్ని రోజులుగా తమిళనాడులో కురిసిన వర్షాలకు, వరదలకు ఇప్పటికీ అక్కడి ప్రజలు ఇంకా ఎంత ఇబ్బందిపడుతున్నారో మనం చూస్తున్నాం. తనకు సంబంధం లేకపోయినా తమిళనాడులో కడలూర్, పాండిచ్చేరి ప్రాంతాలలో సహాయం కొరకు ఎదురుచూస్తున్నారని, వారికి కావాల్సిన కనీస అవసరాలను తన టీం ద్వారా అక్కడి వారికి అందేలా చేశాడు. ఒకరోజు తన ఫేస్ బుక్ అకౌంట్ కు ఒక మెసేజ్ వచ్చింది. ఇప్పటికీ చాలామంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని, సిటీలో చాలామంది ఇలాంటి స్థితిలో ఉన్నారని..ఆ మెసేజ్ చూసి చలించిన ప్రశాంత్ నాయర్ వెంటనే ఆపరేషన్ ‘సలైమణి’ పేరుతో ఆకలి సమస్యలను తీర్చేందుకు కొన్ని మెస్ కూపన్స్ ను ఎవరైతే ఆకలి బాధకు నోచుకుంటున్నారో అందించేలా..   వారికి విద్యార్థులను వాలంటీర్లుగా నియమించి ఆకలి సమస్యను తీర్చాడు. ముందుగానే ఆ హోటల్స్,మెస్ రూమ్స్ ‘సలైమణి’ బృందం డబ్బులు పే చేస్తుంది. ఇలాంటి ఎన్నో ప్రజా సమస్యలను ఆ జిల్లా కలెక్టర్ గా ప్రస్తుతం ప్రభుత్వ అధికారులు చేస్తున్నదానికంటే ఎక్కువగానే చేస్తున్నాడు. తమ సమస్యలను తీర్చడానికి వచ్చిన ప్రశాంత్ నాయర్ వారంతా ఎంతో ఇష్టంగా ‘కలెక్టర్ అన్నయ్యా’ అని పిలుస్తున్నారు.
CB6
 ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వ అధికారులుగా ఎన్నో దారులు ఉన్నాయి,, పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనం వెళ్ళాలి,వాళ్ళ సమస్యలనుపరిష్కరించడమే ముఖ్యమని అంటాడు కలెక్టర్ అన్నయ్య ప్రశాంత్ నాయర్. విధి నిర్వహణలో ఎన్ని సవాళ్ళు ఎదురైనా, తనకు మెసేజ్ పంపే ప్రతి ఒక్కరితో ఎంతో సంతోషంగా వాటికి సమాధానమిస్తున్న ఈ కలెక్టర్ దేవుడికంటే గొప్పగా భావిస్తున్నారు. మనం పుట్టి పెరిగిన దేశానికి సేవ చేయడానికి ఇది ఒక మార్గమేనని అంటున్నాడు ప్రశాంత్ నాయర్. మనకూ ఈ ఇలాంటి కలెక్టర్స్ ఉంటే బాగుణ్ను అనిపిస్తుంది కదా.!

Comments

comments

Share this post

scroll to top