ఈమె బసంతీ టీచర్..కాలివేళ్ళ మద్య చాక్ పీస్ తో బోర్డు మీద రాస్తూ పాఠాలు చెబుతుంది.

కాళ్ళు చేతులు సక్రమంగా ఉండి కూడా మనం చేయలేని ఎన్నో పనులు ఈమె చేస్తోంది. విద్యాబుద్ధులు నేర్పుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. తన కాళ్ళ వేళ్ళతోనే తన తల రాతను మార్చుకుంటూ తన కుటుంబానికి ఆసరాగా నిలుస్తోంది. ఈ వీడియోలో కనిపిస్తున్న ఈమె పేరు బసంతి కుమారి. చిన్నప్పుడే తన చేతుల పెరుగుదల ఆగిపోయి, ఏపనీ చేయడానికి వీలుకాకుండా ఉండిపోయాయి. తమ కూతుర్ని చూసి అధైర్యపడని బసంతీ తల్లిదండ్రులు, స్కూల్ కు పంపిస్తే తమ బిడ్డను ఏడిపిస్తారని ఇంటిదగ్గరే విద్యాబుద్ధులు నేర్పించారు. ఆ నేర్చుకున్న చదువే బసంతి కుటుంబానికి అండగా నిలబడింది.

తమ ఊర్లోనే ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా చేరి అక్కడి పిల్లలకు విద్యాభ్యాసం చేస్తోంది. తన కాలి వేళ్ళ సాయంతో బోర్డుపై చాక్ పీస్ తో రాయడం, పెన్ను పట్టుకొని చేతితో విద్యార్థులకు బోధిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. పాఠశాలలో కేవలం పాఠాలు బోధించడమే కాకుండా, ఇంటి పని చేయడం, తన బట్టలు ఆమె ఉతకడం చేస్తూ తమ పేరెంట్స్ కు భారం కాకూడదని భావిస్తోంది. అన్ని పనులు చేయడానికి మనకు అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా, ఏమీ చేయలేని స్థితిలో యేవో కారణాలతో బ్రతికేస్తున్న మనం బసంతి కుమారిని చూసి ఎంతైనా నేర్చుకోవచ్చు. ఆదర్శంగా నిలుస్తున్న బసంతి కుమారికి హ్యాట్సాఫ్.
Watch Video:( Wait 3 seconds To Load)

Meet Basanti, a teacher without hands. She herself is a chapter #AbKeBarasMoheBitiyaHiDijo Focus TV Beti Bachao Beti Padhao

Posted by Ministry of Women & Child Development on Tuesday, August 11, 2015

Comments

comments

Share this post

scroll to top