అల్లరిమూక నుండి యువతిని కాపాడి, ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్.

దేశ రక్షణ కోసం ప్రాణాలైనా అర్పిస్తాం అని డ్యూటీలో చేరేప్పుడే అతడు ప్రమాణం చేశాడు.. ఆ ప్రామాణాన్ని  తుది శ్వాస విడిచే వరకు మరిచిపోలేదు ఈ ఆర్మీ జవాన్…. అమ్మాయిని రక్షిస్తే , దేశాన్ని రక్షించినట్టే అనుకున్నాడు.. అందుకే అల్లరిమూక చేతిలో ఇబ్బదులు ఎదుర్కొంటున్న 16 యేళ్ల అమ్మాయిని రక్షించే ప్రయత్నంలో ప్రాణాలు విడిచాడు  లాన్స్ నాయక్  చౌదరి.

 

ARMY

ఆగస్ట్ 15 కంటే రెండు రోజుల ముందు ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగింది ఈ ఘటన… పదహారు సంవత్సరాల   టీనేజీ అమ్మాయి పట్ల  అయిదుగురు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు…అంతటితో ఆగక ఆ అల్లరి మూక ఆ అమ్మాయిని సెక్స్ వల్ హరాష్మెంట్ చేయసాగారు… అంతలోనే ఆ అమ్మాయి తండ్రి,తమ్ముడు ఆ అల్లరి మూక ను వారించబోయారు. అయినా ఆ దుండగులు వారిని లెక్క చేయకుండా ఆ అమ్మాయిని అలాగే ఏడిపించసాగరు.

ఇంతలో అక్కడికి ఆర్మీలో లాన్స్ నాయక్ హోదా ఉన్న ..వేద్ మిత్రా చౌదరి వచ్చి వారిని తిట్టాడు, అయిదుగురిలో ఒకడి చెంపపై లాగి కొట్టాడు.. దీంతో కోపంతో రగిలిపోయిన ఆ అల్లరిమూక మరింత గ్యాంగ్ ను తీసుకొచ్చారు.. రాడ్లు, కర్రలతో వచ్చీ రావడంతోనే  చౌదరి మీద పడి కొట్టడం ప్రారంభించారు  ఆ దుండగులు. ఆ దెబ్బలకు తాళలేక చౌదరి మృతి చెందాడు.

దీనిపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ స్వాతంత్ర్యం వచ్చిందంటూ ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటున్న మన దేశంలోన ఇంక ఇటువంటి ఘటనలు జరగడం శోచనీయం.  అమర్ హై లాన్స్ నాయక్ వేద్ మిత్రా చౌదరి.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top