సెల్‌ఫోన్లలో ఎక్కువ రేడియేషన్ ప్రభావం ఉన్నవి ఏవి? సెల్‌ఫోన్ రేడియేషన్ తప్పించుకోవటం ఎలా?

సెల్‌ఫోన్ల వాడ‌కంలో వ‌చ్చే త‌రంగాలు మ‌న‌కు రేడియేష‌న్‌ను క‌లిగిస్తాయ‌ని అంద‌రికీ తెలిసిందే. రేడియేష‌న్ వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే ముప్పు పెరుగుతుంద‌ని సైంటిస్టులు ఎప్ప‌టి నుంచో చెబుతూ వ‌స్తున్నారు. సెల్‌ఫోన్‌ల ద్వారా క‌లిగే రేడియేష‌న్ వ‌ల్ల అప్ప‌టిక‌ప్పుడు వ‌చ్చే పెద్ద ముప్పు ఏమీ లేక‌పోయినప్ప‌టికీ దీర్ఘ‌కాలికంగా ఈ త‌రంగాల బారిన ప‌డితే క్యాన్స‌ర్ వ‌స్తుంద‌ని వైద్యులు కూడా హెచ్చ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే సెల్‌ఫోన్ వాడకాన్ని వీలైనంత వ‌ర‌కు త‌గ్గించాల‌ని కూడా మ‌న‌కు చెబుతుంటారు. అయితే సెల్‌ఫోన్ రేడియేష‌న్ విష‌యానికి వ‌స్తే మ‌న‌కు మార్కెట్‌లో అనేక ర‌కాల ఫోన్లు అందుబాటులో ఉన్నాయి క‌దా, వాటిల్లో కొన్ని మాత్రం బాగా రేడియేష‌న్‌ను క‌లిగిస్తాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌న‌కు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వన్ ప్లస్, హువావే, నోకియా, మైక్రోసాఫ్ట్ ఫోన్లు బాగా ఎక్కువ రేడియేష‌న్‌ను క‌లిగిస్తాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ ఫోన్ల‌లో రేడియేష‌న్ స్థాయి ప‌రిమితి క‌న్నా ఎక్కువ‌గా ఉంటుంద‌ని, 0.60 వాట్స్/కిలోగ్రామ్ క‌న్నా ఎక్కువ రేడియేష‌న్ ఈ ఫోన్ల‌లో ఉంటుంద‌ని వారు నిర్దారించారు. క‌నుక ఈ ఫోన్ల‌ను వాడేవారు ఒక‌సారి ఆలోచించాల‌ని సూచిస్తున్నారు. ఇక రేడియేష‌న్‌కు సంబంధించి ఎటువంటి అంతర్జాతీయ ప్రమాణాలూ లేన‌ప్ప‌టికీ 0.60 వాట్స్/కిలోగ్రామ్ రేడియేషన్‌ మించని ఫోన్లను వాడాల‌ని సైంటిస్టులు చెబుతున్నారు. దీని ప్ర‌కారం చూస్తే పైన చెప్పిన స‌ద‌రు కంపెనీల‌కు చెందిన ఫోన్ల రేడియేష‌న్ 0.6 వాట్స్‌/ కిలోగ్రామ్ క‌న్నా ఎక్కువ‌గానే ఉంటుండ‌డం విశేషం. అంటే.. ప‌రిమితికి మించి రేడియేష‌న్‌ను క‌లిగించే ఫోన్ల‌ను మ‌నం వాడుతున్నామ‌న్న‌మాట‌.

రేడియేష‌న్ 0.60 వాట్స్/కిలోగ్రామ్ కు మించిన ఫోన్ల జాబితాలో వన్ ప్లస్ 5టి (1.68 వాట్స్/కిలోగ్రామ్) మొదటి స్థానంలో ఉంది. ఇక ఈ జాబితాతో ఐఫోన్ 7 పదో స్థానంలో, ఐఫోన్ 8 పన్నెండవ స్థానంలో, ఐఫోన్ 7 ప్లస్ పదిహేనవ స్థానంలో ఉన్నాయి. అదేవిధంగా సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్-1 కాంపాక్ట్ 11వ స్థానంలో, బ్లాక్‌బెర్రీ డి.టి.ఇ.కె. 60 14వ స్థానాల్లో ఉన్నాయి. తక్కువ రేడియేషన్ వెలువరించే ఫోన్ల జాబితాలో సోనీ ఎక్స్‌పీరియా ఎమ్5 (0.14), సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8 (0.17) ఎస్6 ఎడ్జ్ ప్లస్ (0.22), గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ (0.25), సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8 (0.26), ఎస్7 ఎడ్జ్ (0.26) ఉన్నాయి. క‌నుక మీరు కూడా సెల్ ఫోన్‌ను కొనే ముందు దాని ద్వారా ఎంత రేడియేష‌న్ వ‌స్తుందో తెలుసుకుని మ‌రీ వాటిని కొనుగోలు చేయండి. 0.60 వాట్స్/కిలోగ్రామ్ క‌న్నా ఎక్కువ రేడియేష‌న్‌ను వెలువ‌రించే ఫోన్ల‌ను కొన‌కండి. ఇక మీ ఫోన్ రేడియేషన్ ఏ స్థాయిలో ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే.. మీ ఫోన్ యూజర్ మాన్యువల్ లేదా ఆ కంపెనీ వెబ్‌సైట్లో తెలుసుకోవచ్చు. వాటిల్లో ఫోన్ రేడియేష‌న్ విలువ‌ను మీకు స్పెసిఫిక్ అబ్జార్షన్ రేట్ (ఎస్.ఎ.ఆర్) తో చూపిస్తారు. దాని విలువ 0.60 వాట్స్/కిలోగ్రామ్ క‌న్నా త‌క్కువగా ఉండాలి. అలా ఉంటేనే ఆ సెల్‌ఫోన్ రేడియేష‌న్‌ను త‌క్కువ‌గా విడుద‌ల చేస్తుంది అని తెలుసుకోవాలి. దీంతో రేడియేష‌న్ ప‌రంగా మీ ఫోన్ మంచిదా, కాదా అనే విష‌యం తెలుస్తుంది. దాన్ని బ‌ట్టి మీరు ఆ ఫోన్‌ను వాడాలా, వ‌ద్దా అనే నిర్ణ‌యం తీసుకోవ‌చ్చు.

అయితే రేడియేష‌న్ విష‌యానికి వ‌స్తే ఏ ఫోన్‌కైనా అది ఎంతో కొంత ఉంటుంది కనుక దాన్నుంచి బ‌య‌ట ప‌డాలంటే ప‌లు సూచ‌న‌లు పాటించాలి. అవేమిటంటే..
* సెల్‌ ఫోన్ల‌లో వీలైనంత వ‌ర‌కు త‌క్కువ‌గా మాట్లాడాలి. ల్యాండ్ లైన్‌కే ప్రాధాన్య‌త‌నివ్వాలి.
* ఎక్కువ సేపు సెల్‌ఫోన్‌లో మాట్లాడాల్సి వ‌స్తే హెడ్ సెట్‌ను వాడాలి. లేదంటే మెసేజ్‌లు చేయాలి.
* సెల్‌ఫోన్ల‌ను వీలైనంత వ‌ర‌కు శ‌రీరానికి దూరంగా ఉంచాలి.
* రాత్రి పూట త‌ల‌కు ద‌గ్గ‌ర‌గా ఫోన్‌ను పెట్టి నిద్రించ‌రాదు.
* బ‌య‌ట తిరిగే స‌మయంలో వీలైనంత వ‌రకు సెల్ ఫోన్‌ను శ‌రీరానికి దూరంగా ఉండేలా చూసుకోవాలి.

Comments

comments

Share this post

scroll to top