వాట్సాప్ లో ఫోటోలు “గ్యాలరీ” నుండి పంపిస్తున్నారా.? అది తప్పు..ఎందుకో తెలుసా.? మారేలా.?

వాట్సాప్‌… ప్ర‌పంచంలో అత్య‌ధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ల‌లో ఈ యాప్ ప్ర‌థ‌మ స్థానంలో ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను ఇందులో అందిస్తున్నారు. దీంతో యూజ‌ర్లు కూడా ఆ ఫీచ‌ర్లకు ఫిదా అవుతున్నారు. అందులో భాగంగానే ఎప్ప‌టిక‌ప్పుడు వాట్సాప్‌ను వాడే యూజ‌ర్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే వాట్సాప్ లో సాధార‌ణంగా మ‌నం ఏవైనా ఇమేజ్‌ల‌ను పంపుకుంటే ఆటోమేటిక్‌గా వాటి క్వాలిటీ త‌గ్గుతుంది. గ‌మ‌నించారు క‌దా..! కానీ కింద ఇచ్చిన టిప్ పాటిస్తే దాంతో వాట్సాప్‌లో క్వాలిటీ ఏ మాత్రం త‌గ్గకుండానే ఇమేజ్ ల‌ను పంపుకోవ‌చ్చు. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. మ‌రి వాట్సాప్‌లో ఇమేజ్ క్వాలిటీ త‌గ్గ‌కుండా ఉండాలంటే.. మీరు పాటించాల్సిన ఆ టిప్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేసి అందులో చాట్ విండోలో మెసేజ్‌ను టైప్ చేసే బాక్స్‌లో ప‌క్క‌నే ఉండే అటాచ్‌మెంట్ బ‌ట‌న్‌ను ప్రెస్ చేయాలి.

2. అటాచ్‌మెంట్ బ‌ట‌న్‌ను ప్రెస్ చేశాక వ‌చ్చే పాప‌ప్ విండోలో గ్యాల‌రీ కాకుండా డాక్యుమెంట్ అనే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి.

3. అనంత‌రం వ‌చ్చే మ‌రో విండోలో బ్రౌజ్ అద‌ర్ డాక్స్ అనే ఆప్ష‌న్ ను ఎంచుకోవాలి.

4. బ్రౌజ్ అద‌ర్ డాక్స్ అనే ఆప్ష‌న్‌ను ఎంచుకోగానే ఫైల్ మేనేజ‌ర్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు పంపాల‌నుకునే ఇమేజ్‌లు ఏ ఫోల్డ‌ర్‌లో ఉన్నాయో సెలెక్ట్ చేసుకోవాలి. వాటిల్లో ఉండే ఇమేజ్‌ల‌ను సెలెక్ట్ చేయాలి.

5. అనంత‌రం ఓకే బ‌ట‌న్‌ను ప్రెస్ చేయ‌గానే ఆ ఇమేజ్‌లు డాక్యుమెంట్స్ రూపంలో వాట్సాప్‌లోకి అప్‌లోడ్ అవుతాయి. త‌రువాత సెండ్ బ‌ట‌న్‌ను ప్రెస్ చేస్తే చాలు, దాంతో మీరు పంపే ఇమేజ్‌లు ఇమేజ్ ఫార్మాట్‌లో కాక డాక్యుమెంట్ ఫార్మాట్‌లో అవ‌తలి వారికి వెళ్తాయి. అలా వెళ్లే ఇమేజ్‌లు క్వాలిటీ ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఉంటాయి.

Comments

comments

Share this post

scroll to top