మనస్సులో మీ ఇష్టమొచ్చిన నెంబర్ అనుకోండి…అదేంటో నేేను కరెక్ట్ గా చెప్పేస్తా.!

హయ్..చిన్నప్పుడు స్కూల్ లో మేమంతా…. ఓ సరదా ఆట ఆడుకునే వాళ్లం,  మీకు గుర్తుందో లేదో కానీ….చిన్న లాజిక్ ద్వారా మీ మనసులో అనుకున్న సంఖ్యను కరెక్ట్ గా చెప్పేయొచ్చు . ఫస్ట్ దీనిని మీ మీద ప్రయోగించి దీని వెనకున్న లాజిక్ ను తర్వాత మీకు చెప్పేస్తా…చాలా మందికి దీని గురించి తెలిసే ఉండొచ్చు…అయినప్పటికీ మరోసారి సరదాగా ట్రై చేసి, చిన్నప్పుడు  ఈ ఆట ఎవరితో ఆడారో వారిని ఓ సారి గుర్తు తెచ్చుకోండి. వీలైతే మరోసారి పలకరించండి.

  • మీ మనస్సులో మీరో సంఖ్య అనుకోండి. ( 0 నుండి మొదలు మీ ఇష్టమొచ్చిన నెంబర్).
  • ఇప్పుడు దానిని డబుల్ చేయండి.
  • దానికి నేను బహుమతిగా ఇస్తున్న ఓ  10 కలుపుకోండి.
  • ఇప్పుడు మొత్తాన్ని సగం చేయండి.
  • ఇప్పుడు వచ్చిన మొత్తంలో నుండి మీరు అనుకున్న ఆ సంఖ్యను తీసేయండి.
  • ఇప్పుడు మీ దగ్గర మిగిలింది ఎంతో తెలుసా.???? ఆన్సర్  “5”

addtext_com_MDM1NDI3ODkxMw

Explanation:

ఉదాహరణకు మీరు మీ మనస్సులో 2 అనుకుందాం.దానిని డబుల్ చేస్తే…..4 , దానికి నావి 10 కలిపితే 14…ఇప్పుడు మొత్తాన్ని సగం చేస్తే 7, ఇప్పుడు దాంట్లోంచి మీరు మొదటిగా అనుకున్నది తీసేస్తే….5, సో నా ఆన్సర్ కరెక్ట్.

Logic:

ఇక్కడ మీ మనస్సులో అనుకున్న నెంబర్ తో ఎటువంటి సంబంధం ఉండదు…ఎందుకంటే లాస్ట్ లో ఫస్ట్ మీరు అనుకున్న నెంబర్ ను తీసేయండి అనే రూల్ ప్రకారం ఆ నెంబర్ ఎగిరిపోతోంది. మీరెంతైనా అనుకోండి. నేను ఇంత కలుపుకోండి అని ఇచ్చిన నెంబర్ లో సగం మాత్రమే ఆన్సర్ గా మిగులుతుంది. ( నేను 10 కలుపుకోండి అంటే 5, 20 కలుపుకోండి అంటే 10, 2 కలుపుకోండి అంటే 1….ఇలా కలిపుకోండి అని చెప్పిన దాంట్లో సగం ఆన్సర్ గా మిగులుతుంది. )

Comments

comments

Share this post

scroll to top