అది IAS ల గ్రామం.. 75 ఇల్లుంటే అందులో 47 మంది IAS అధికారులే.

75 ఇల్లు, 47 మంది ఐఏఎస్ అధికారులు…ఆ గ్రామం గురించి చెప్పాలంటే ఇచ్చే ఇంట్రడక్షన్ ఇది. దీనిని బట్టి చెప్పొచ్చు ఆ గ్రామం సరస్వతీ పుత్రుల నిలయమని…దేశ సేవలో మా గ్రామ యువకులు అంటూ మురిసిపోతుంటారు ఆ గ్రామస్తులు. ఇంటర్మీడియట్ నుండే టార్గెట్ టు సివిల్స్ స్టార్ట్ చేసి…తమ లక్ష్య సాధనకు నిరంతర ప్రయత్నమే తమ విజయం అంటారు యువ IAS లు..

ఆ గ్రామం గురించిన మరింత వివరణ:

ఆ ఊరి గ్రామస్థులు చెప్పిన ప్రకారం, ఆ ఊరి నుండి మొదటిసారిగా ముస్తఫా హుస్సేన్ ఐఏఎస్ ఉత్తీర్ణుడయ్యాడు. ప్రముఖ కవి వామిక్ జాన్పురి కుమారుడైన హుస్సేన్ 1914లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్ష పాస్ అయి, పబ్లిక్ కమీషన్ సర్వీస్ లో చేరాడు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో  సెకండ్ ర్యాంక్ సాధించిన ఐఏఎస్ ఇందు ప్రకాష్ అడుగుజాడల్లో హుస్సేన్ నడిచి, ఆయన్ను ఇన్స్పిరేషన్ గా చేసుకొని, పబ్లిక్ కమీషన్ సర్వీస్ లో చేరాడు.
catch-750x500
అప్పటినుండి మధిపట్టి గ్రామంలోని యువకులు చాలా మంది సివిల్ సర్వీసెస్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ,దేశ ప్రగతికి తమ వంతు కృషి చేయడానికి ఎంతో కష్టపడ్డారు. ఈ ఊరిలో చాలా మంది చదువుకున్న యువకులు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ మరియు ప్రపంచబ్యాంకులలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక రీసెంట్ ఈ గ్రామానికి చెందిన కొందరు యువకులు కొత్త రికార్డ్ ను సృష్టించారు. సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణులై ఐఏఎస్ కు సెలెక్ట్ అయ్యారు. బీహార్ ఛీఫ్ సెక్రెటరీగా మరో అతను విధులు నిర్వర్తిస్తున్నాడు.
travel-tour-yatra-aisa-bhi-hota-hai-madhopatti-jaunpur-75-house-47-ias-article-by-anurag-singh-life-style-online-news-in-hindi-india
ఇక్కడ చాలామంది చదువుకున్న విద్యార్థులు ఇంటర్మీడియట్ పూర్తికాగానే, పబ్లిక్ కమీషన్ సర్వీస్ మరియు ఐఏఎస్ పుస్తకాలను కొనుక్కొని వాటినే చదువుతూ, వాటి మీదే ఎక్కువగా దృష్టికేంద్రీకరిస్తారట. ఇక్కడ చాలా వరకూ ఇంగ్లీష్ లో వీక్ కావడం, చిన్నప్పటి నుండే హిందీనే ఎక్కువగా చదువుతూ ఉండడం వలన, ఆ పుస్తకాలను తీసుకొని, ఆ పరీక్షల కోసం ఎప్పుడూ ప్రిపరేషన్ లో ఉంటారని అక్కడి ఉపాధ్యాయుడు చెబుతున్నారు.
మధిపట్టి గ్రామంలో ఇలా ఐఏఎస్ ఆఫీసర్స్  గ్రామంగా పిలవబడుతుంటే, ఘాజీపూర్ జిల్లాలోని ఘమార్ గ్రామాన్ని ఆర్మీ గ్రామంగా పిలుస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఇంటి నుండీ ఒకరు ఇండియన్ ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నారట. ఎంతైనా వీరంతా గ్రేటే కదా. దేశసేవలో ముందుకు వెళుతూ అభివృద్ధి పధంలో తీసుకువెళ్తున్న వీరందరికీ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Comments

comments

Share this post

scroll to top