కూ.. చుక్.. చుక్.. మంటూ సాగే రైలు హారన్ ఎవరికి నచ్చదు చెప్పండి. అది పాత రైలు అయితే హారన్ అలా ఉంటుంది. అదే కొత్త రైలు అయితే దాని హారన్ వేరేలా ఉంటుంది. అయితే నిజానికి మనం పరిశీలించాలే గానీ ప్రతి అంశం ద్వారా కూడా మనకు ఓ కొత్త విషయం తెలుస్తుంది. మరి రైలు హారన్ గురించి మనం ఏం తెలుసుకోవచ్చో తెలుసా..? అదేంటీ.. ఎలా వచ్చినా రైలు హారన్ హారనే కదా. అందులో తెలుసుకోవడానికి ఏముంటుందీ..? అనే కదా మీరు అడగబోయేది. అయితే, అవును. ఉంటుంది. రైలు హారన్ కు కూడా పలు అర్థాలు ఉంటాయి. అవేమిటంటే…
1. ఒక షార్ట్ హారన్‌కు
ట్రెయిన్ నెక్ట్స్ ట్రిప్‌కు సిద్ధమవుతున్నట్టు లెక్క. స్టేషన్లో ఆగి బయల్దేరుతుంటే ట్రెయిన్స్ ఒకసారి షార్ట్ హారన్ ఇస్తాయి. అంటే ప్రయాణానికి సిద్ధమవుతున్నట్టు అర్థం చేసుకోవాలి.
2. రెండు షార్ట్ హారన్స్
ట్రెయిన్ ఇంజిన్‌లో ఉండే మోటార్ మ్యాన్ గార్డుకు సంకేతంగా రెండు షార్ట్ హారన్స్ మోగిస్తాడు. దీంతో గార్డు సిగ్నల్ క్లియర్‌గా ఉందీ, లేనిదీ మోటార్ మ్యాన్‌కు చెబుతాడు.
3. మూడు షార్ట్ హారన్స్
ట్రెయిన్ మూడు సార్లు షార్ట్ హారన్స్ మోగిందంటే రైలు మోటార్ మ్యాన్ కంట్రోల్ తప్పిందని అర్థం. దీంతో గార్డు వెనుక నుంచి వాక్యూమ్ బ్రేక్ లాగుతాడు. ట్రెయిన్ ఆగుతుంది.
4. నాలుగు షార్ట్ హారన్స్
ట్రెయిన్ నాలుగు సార్లు షార్ట్ హారన్స్ మోగించిందంటే ఆ ట్రెయిన్లో ఏదో సాంకేతిక లోపం తలెత్తినట్టు తెలుసుకోవాలి. దీంతో ట్రెయిన్ ముందుకు కదలదని అర్థం చేసుకోవాలి.
5. ఒక లాంగ్, ఒక షార్ట్ హారన్
రైలు ఇలా హారన్ మోగిందంటే గార్డు బ్రేక్ పైప్ సిస్టమ్‌ను సెట్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాతే మోటార్మ్యాన్ రైలు ఇంజిన్‌ను ఆన్ చేస్తాడు.
6. రెండు లాంగ్, రెండు షార్ట్ హారన్స్
ఈ హారన్‌తో గార్డు రైలు ఇంజిన్‌ను తన ఆధీనంలోకి తీసుకుంటాడు. రైలు మోటార్మ్యాన్ కంట్రోల్లో లేదని తెలుసుకోవాలి.
7. కంటిన్యూగా హారన్
రైలు కంటిన్యూగా హారన్ చేస్తుంటే ఆ రైలు ఆ స్టేషన్లో ఆగదని తెలుసుకోవాలి.
8. రెండు సార్లు ఆగి రెండు హారన్లు మోగితే
రైలు రైల్వే క్రాసింగ్ దాటుతుందని తెలుసుకోవాలి.
9. రెండు లాంగ్, రెండు షార్ట్ హారన్స్
ట్రెయిన్ ట్రాక్‌లు చేంజ్ అవుతున్నాయని తెలుసుకోవాలి.
10. రెండు షార్ట్ ఒక లాంగ్ హారన్
ప్యాసింజర్ చైన్ లాగినా, గార్డు వాక్యూమ్ బ్రేక్ లాగినా ఇలా హారన్ చేస్తారు.
11. ఆరు సార్లు షార్ట్ హారన్స్
ట్రెయిన్‌కు ఏదైనా ప్రమాదం వస్తే ఇలా హారన్ మోగిస్తారు.