ట్రాఫిక్ సిగ్న‌ల్స్ లో….MNL, INL, VAC అనే పదాల‌ను గ‌మ‌నించారా? వీటి మీనింగ్ ఏంటో తెలుసా?

మ‌నం నిత్యం ట్రాఫిక్ సిగ్న‌ల్స్ ద‌గ్గ‌ర నిమిషాల కొద్ది గ్రీన్ సిగ్న‌ల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం…..అదే సంద‌ర్భంలో ట్రాఫిక్ పోల్ మీద ఒక‌సారి MNL అని, మ‌రోసారి INL అని, అప్పుడ‌ప్పుడూ…..VAC అనే కొత్త కొత్త ఇంగ్లీష్ ప‌దాలు క‌నిపిస్తుంటాయి. అస‌లు వీటి అర్థం ఏంటి? వీటిని బ‌ట్టి ఏం తెలుసుకోవొచ్చో ఇప్పుడు ఓ సారి ప‌రిశీలించే ప్ర‌య‌త్నం చేద్దాం.

  • MNL అంటే మ్యానువ‌ల్ (Manual) అని అర్థం…అంటే సిగ్నల్ ద‌గ్గ‌ర ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉండి… ట్రాఫిక్ ను బ‌ట్టి….గ్రీన్, రెడ్ సిగ్న‌ల్స్ ఇస్తూ ఉంటాడ‌న్న మాట‌.!

  • INL అంటే ఇన్టెలిజెన్స్ (Intelligence ) అంటే….. ట్రాఫిక్ ను కంట్రోల్ చేసే టైమ్ ఆల్రెడీ సెట్ చేసి ఉంటుంద‌న్న మాట‌. ! సాధార‌ణంగా రెడ్ సిగ్న‌ల్ 180 సెకండ్లు, గ్రీన్ సిగ్న‌ల్ 60 సెకండ్ల‌కు సెట్ చేసి ఉంటుంది. దీనికి పోలీస్ కానిస్టేబుల్ ఉండాల్సిన అవ‌స‌రం లేదు…దాని ప‌ని టైమ్ ను బ‌ట్టి అదే చూసుకుంటుంది.

  • VAC అంటే Vehicle Actuated Control…ఇది అప్ గ్రేడెడ్ వ‌ర్ష‌న్ అన్న‌మాట‌…. జంక్ష‌న్ లో ఉన్న సీసీ కెమెరా….ట్రాఫిక్ ను బ‌ట్టి ఏ రూట్ వారికి ఎంత టైమ్ సిగ్న‌ల్ ఇస్తే ట్రాఫిక్ క్లియ‌ర్ గా అవుతుందో అని దానంత‌ట అదే….ట్రాఫిక్ ఎక్కువ‌గా ఉన్న వారికి ఎక్కువ స‌మ‌యాన్ని త‌క్కువ‌గా ఉన్న వారికి త‌క్కువ స‌మయాన్ని ఇస్తుంద‌న్న‌మాట‌.!! అభివృద్ది చెందిన చాలా దేశాల్లో ఈ టెక్నిక్ ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. దీనిలో ఓ ప్ర‌త్యేక అల్గారిథ‌మ్ సెట్ చేసి ఉంటుంది.

Comments

comments

Share this post

scroll to top