“లైఫ్ బాయ్” సబ్బు వెనకున్న ఈ షాకింగ్ నిజం మీకు తెలుసా.? LIFEBOY అని ఎందుకు పెట్టలేదంటే.?

నిత్య జీవితంలో మ‌నం అనేక వ‌స్తువుల‌ను గ‌మ‌నిస్తుంటాం. వాటిని వాడుతుంటాం. కానీ కొన్ని వ‌స్తువుల‌కు ఉండే పేర్లు మాత్రం మ‌న‌కు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తాయి. ఆ పేర్ల‌కు అర్థాలు ఏమిటో కూడా మ‌న‌కు తెలియ‌దు. కానీ ఆ పేర్లు ఉన్న వ‌స్తువుల‌ను మాత్రం ఉప‌యోగిస్తుంటాం. అలాంటి వ‌స్తువుల్లో లైఫ్‌బాయ్ సోప్ కూడా ఒక‌టి. అవును.. ఇంత‌కీ ఇందులో తెలుసుకోవ‌ల్సింది ఏముంది ? ఆ స‌బ్బు పేరులో అంత ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించే విష‌యం ఏముంది ? అంటారా..! అయితే నిజంగానే ఇప్పుడు ఆ స‌బ్బు పేరు గురించి మేం చెప్ప‌బోయే విష‌యం తెలిస్తే మీకు కూడా ఆశ్చ‌ర్యం వేస్తుంది. ఎందుకంటే…

లైఫ్ బాయ్ స‌బ్బును చాలా మంది వాడుతారు క‌దా. అయితే అస‌లు నిజానికి లైఫ్ బాయ్ అంటే.. life + boy క‌లిపి lifeboy అని పేరు ఉండాలి క‌దా. కానీ అందుకు విరుద్ధంగా Lifebuoy అని ఉంది గ‌మ‌నించారు క‌దా. మ‌రిలా పేరును ఎందుకు పెట్టారో తెలుసా.? ఎందుకంటే.. Lifebuoy అనే వ‌స్తువు నిజంగానే ఉంది. అందుక‌నే ఆ పేరును పెట్టారు. చాలా మంది lifeboy అని అనుకోవ‌డంతోపాటు బాయ్స్ లైఫ్‌ను సేవ్ చేసే స‌బ్బు అని అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే..

Lifebuoy అనే ప‌ద‌మే క‌రెక్ట్. lifeboy కాదు. Lifebuoy అంటే.. స‌ముద్రంలో లేదా న‌దుల్లో, నీరు బాగా లోతు ఉన్న ప్రాంతాల్లో ప‌డిపోయిన వ్య‌క్తుల‌ను కాపాడేందుకు Lifebuoyను ఉప‌యోగిస్తారు. అది ఒక ర‌బ్బ‌ర్ ట్యూబ్‌. వాహ‌నాల ట్యూబ్‌ను పోలి గుండ్రంగా ఉంటుంది. దాన్ని Lifebuoy అంటారు. అంటే.. Lifebuoy లా మ‌న శ‌రీరానికి ఆ స‌బ్బు ర‌క్ష‌ణనిస్తుంద‌ని ఆ కంపెనీ వారు ఆ స‌బ్బుకు ఆ పేరు పెట్టారు. ఇదీ.. Lifebuoy స‌బ్బు పేరు వెనుక ఉన్న అస‌లు అర్థం. ఇప్పుడు మీరు నిజంగానే ఆశ్చ‌ర్య‌పోయి ఉంటారు క‌దా..! లైఫ్ బాయ్ స‌బ్బుకు చెందిన కొన్ని పాత యాడ్స్‌ను కూడా మీరు ఫొటోల్లో చూడ‌వ‌చ్చు. భ‌లే ఆశ్చ‌ర్యంగా ఉన్నాయి క‌దా..!

Comments

comments

Share this post

scroll to top