ఫేమస్ కంపెనీలు… క్రియేటివ్ లోగో (LOGO)లు… మరి వాటి అర్థాల మాటేమిటి..?

ఒకప్పుడైతే దేవుళ్లు, దేవతలు, తమ పూర్వీకులు, మొక్కుల ప్రకారం తల్లిదండ్రులు పిల్లలకు పేర్లు పెట్టేవారు. కానీ ఇప్పుడు మాత్రం తల్లిదండ్రులు అర్థాలు చూసి మరీ తమ పిల్లలకు పేర్లు పెడుతున్నారు. అయితే మనుషుల సంగతి పక్కన పెడితే కొంత మంది వ్యాపారవేత్తలు కూడా తమ కంపెనీలకు, వాటిలో తయారయ్యే వివిధ రకాల ఉత్పత్తులకు కూడా దాదాపు ఇలాంటి ఏదో ఒక అర్థం వచ్చే పేరునే పెడుతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా కొంత మంది ఇంకా ముందుకు వెళ్లి మరింత క్రియేటివ్‌గా తమ తమ కంపెనీల లోగోలను డిజైన్ చేస్తున్నారు. అలాంటి వాటిలో మనకు బాగా తెలిసిన పాపులర్ అయిన పలు కంపెనీల లోగోల గురించి, వాటిలో దాగి ఉన్న అర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

టయోటా…
కార్లను తయారు చేసే టయోటా (TOYOTA) కంపెనీ తెలుసుగా. దాని లోగోలో ఉండే మూడు దీర్ఘ వృత్తాలు మూడు విషయాలను సూచిస్తాయి. ఒకటి వినియోగదారుడు, మరొకటి ఉత్పత్తి, ఇంకొకటి ఆ కంపెనీ ప్రగతి.

పెప్సీ…
శీతల పానీయాల విక్రయదారు పెప్సీ లోగోను చూశారుగా. అయితే ఆ లోగోను తయారు చేయించేందుకు పెప్సీ ఏకంగా 10 లక్షల డాలర్లను ఖర్చు చేసిందట. ఇందుకోసం ఓ డిజైనర్‌ను ప్రత్యేకంగా నియమించిందట. అతను చాలా రోజులు కష్టపడి పెప్సీ కొత్త లోగోను తయారు చేశాడు. అయితే ఆ లోగో ఫెంగ్ షుయ్ వాస్తు సింబల్‌ను పోలి ఉంటుందట. దానికి డావిన్సీ కోడ్‌లోని ఓ మెసేజ్ అర్థంగా వస్తుందట. ఈ అర్థాన్ని వివరిస్తూ ఆ డిజైనర్ ఏకంగా 27 పేజీలతో కూడిన ఓ డాక్యుమెంట్‌నే తయారు చేసి ఇచ్చాడు. కాగా క్లుప్తంగా చెప్పాలంటే పెప్సీ లోగోకు పునరుజ్జీవం కలిగించే శక్తి అని అర్థం వస్తుందట.

బీఎండబ్ల్యూ…
బీఎండబ్ల్యూ కంపెనీ ఇప్పుడంటే కార్లను తయారు చేస్తోంది. కానీ అది ఒకప్పుడు ఎయిర్‌క్రాఫ్ట్‌లను తయారు చేసేదట. కాగా ఆరంభంలో ఉన్న లోగోనే ఇప్పటికీ ఆ కంపెనీ వాడుతుందట. దాని లోగోలో ఉండే బ్లూ, వైట్ కలర్లు ఎయిర్‌క్రాఫ్ట్ ప్రొపెల్లర్‌ను సూచిస్తాయి.

యాపిల్…
సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్‌కు చెందిన లోగో చూశారుగా. సగం కొరికిన యాపిల్‌లా ఉంటుంది. అయితే ఈ డిజైన్‌ను ఆడం అండ్ ఈవ్‌కు చెందిన ట్రీ ఆఫ్ నాలెడ్జ్ కథలో వివరించబడిన బహిష్కరించబడిన పండు అనే స్టోరీ నుంచి తీసుకున్నారు.

ఫెడ్‌ఎక్స్…
లాజిస్టిక్స్, కొరియర్ కంపెనీ ఫెడ్‌ఎక్స్ లోగో చూస్తే అందులో ఆంగ్ల అక్షరాలు E, X ల మధ్య ఒక బాణం గుర్తు ఇమిడిపోయి ఉంటుంది. ఇది ఆ కంపెనీ భవిష్యత్ ప్రణాళికలను, ముందు చూపును సూచిస్తుంది.

company-logos

మెర్సిడెస్ బెంజ్…
కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ లోగోలో మూడు స్టార్లు ఉంటాయి. ఇవి ఆ కంపెనీ నాణ్యతను తెలియజేస్తాయి.

గూగుల్…
సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్‌కు చెందిన లోగోను నాలుగు ప్రాథమిక రంగులతో సింపుల్‌గా తయారు చేశారు. తామంతా సింపులని, తమకు ఇతర కంపెనీలలా రూల్స్ వర్తించవని తెలియజేసేందుకే గూగుల్ ఈ విధంగా తన లోగోను తయారు చేసింది.

అడిడాస్…
అడిడాస్ కంపెనీ లోగోలో ఉండే మూడు గీతలు పర్వతాన్ని సూచిస్తాయి. ప్రజలు అలాంటి అడ్డంకులను అధిగమించి జీవితంలో ముందుకు సాగాలని ఆ లోగో సూచిస్తుంది.

ఔడి…
కార్ల కంపెనీ ఔడి లోగోలో ఉండే నాలుగు వృత్తాలు ఆ కంపెనీకి చెందిన 4 వ్యవస్థాపక కంపెనీలను సూచిస్తాయి.

ఐబీఎం…
ఐబీఎం కంపెనీ లోగోలో ఉండే తెల్ల గీతలు అందరూ సమానమే అన్న భావనను సూచిస్తాయి.

వోక్స్‌వాగన్…
వోక్స్‌వాగన్‌లో ఉండే V అక్షరం వోక్స్‌ను, W అక్షరం వాగన్‌ను సూచిస్తాయి. వోక్స్ అంటే జర్మన్ భాషలో ప్రజలని అర్థం. అలాగే వాగన్ అంటే కారని అర్థం. అంటే ప్రజల కోసమే ఆ కార్ అని అర్థం.

అమెజాన్…
ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ఓ బాణం గుర్తు ఆంగ్ల అక్షరం A నుంచి Z వరకు సాగి ఉంటుంది. అంటే వారి వద్ద ఎ టు జడ్ అన్ని రకాల వస్తువులు దొరుకుతాయని అర్థం.

ఎల్‌జీ…
ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారు ఎల్‌జీ లోగోలో ఉండే సింబల్స్ ప్రపంచాన్ని, భవిష్యత్తును, మానవత్వాన్ని, యువతను, టెక్నాలజీని సూచిస్తాయి. అందులో ఉండే ఎరుపు రంగు స్నేహభావాన్ని సూచిస్తుంది.

కోకా కోలా…
శీతల పానీయాల తయారీదారు కోకా కోలా లోగోలో ఉండే అక్షరం O డెన్మార్క్ జాతీయ పతాకాన్ని సూచిస్తుంది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోనూ అత్యంత సంతోషవంతమైన దేశంగా డెన్మార్క్ పేరుగాంచడంతో ఆ దేశ జాతీయ పతాకం సింబల్‌తో కోకా కోలా వారు తమ లోగోను తయారు చేసుకున్నారు.

మిత్‌సుబిషి…
మిత్‌సుబిషి లోగోలో ఉండే మూడు డైమండ్ సింబల్స్ నమ్మకాన్ని, సమగ్రతను, విజయాన్ని సూచిస్తాయి.

యూనీలీవర్…
యూనీలీవర్ కంపెనీ లోగోను చూస్తే వారు తయారు చేసే వస్తువులన్నీ ఆ లోగోలో కనిపిస్తాయి.

Comments

comments

Share this post

scroll to top