డాక్టర్లూ…… మందుల చిటీ మీద కోడిరాత రాయకండి.! అదేశాలు జారీ చేసిన MCI.

“డాక్టర్లు రాస్తే బ్రహ్మ కు తప్ప సామాన్యులకు అర్థం కాదు.” ఈ సెటైర్ లో చాలా నిజం ఉంది. డాక్టర్లు రాసే ఈ కోడిరాత వల్లే అమెరికాలో సంవత్సరానికి 7 వేల మందికి పైగా చనిపోతున్నారట!  15 లక్షల మంది ఆరోగ్యం దెబ్బతింటుందట.!! మన దగ్గర కూడా ఇటువంటి కేసులు చాలానే ఉన్నాయి. డాక్టర్లు రాసే ప్రిస్క్రిషన్స్ అర్థం కాక తమకు తోచిన మందులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న ఫార్మాసిస్ట్ లు… ఈ కారణంగానే చాలామంది రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నల్గొండకు చెందిన పరమాత్మ అనే ఫార్మాసిస్టు సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడారు. దీంతో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి దానికనుగునంగా డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్ పై కొన్ని ఆదేశాలు జారీ చేసింది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (MCI).

మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (MCI) ఆదేశాలు:

  • డాక్టర్లు రాసే మందుల చీటిలు అందరికి అర్థం అయ్యే రీతిలో పెద్ద అక్షరాలతో స్పష్టంగా ఉండాలి.
  • ఔషధాల పేర్లతో కాకుండా ఆ ఔషధ జనరిక్‌ పేరుతో ప్రిస్కిప్షన్ విధిగా రాయాలి.

doctors-priscription
‘‘చాలా సందర్భాల్లో నా సహ వైద్యుడు రాసిన చీటీరాత నాకే అర్థం కాదు. ఓ వైద్యుడి రాత మరో వైద్యుడికి, ఫార్మాసిస్టుకూ అర్థం కాకపోతే.. ఆ చీటీ వల్ల ఉపయోగమే లేదు. పైగా అనర్థాలు జరిగే అవకాశముంది అని ఓ పెద్ద డాక్టరే అన్నారంటే….మన డాక్టర్లు ప్రిస్క్రిప్షన్స్ లో రాసే చేతిరాత ఎలా ఉంటుందో ఊహించుకోవొచ్చు.!

#MCI జారీ చేసిన ఈ నియమాలను ఖచ్చితంగా అమలు చేస్తే…గందరగోళానికి అవకాశం ఉండదు, దానికి తోడు తక్కువ ధరకే దొరికే జనరిక్ మందులు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తాయి.

Note: ఇలాంటి విలువైన సమాచారం డైరెక్ట్ గా మీ వాట్సాప్ లో చదవాలనుకుంటే……… మా వాట్సాప్ నెంబర్ 7997192411 కు START అని మెసేజ్ చేయండి.

Comments

comments

Share this post

scroll to top