కాలిక్యులేటర్ కంటే ముందే.. కరెక్ట్ ఆన్సర్..!

బాబూ తొమ్మిది తొమ్ముదుల ఎంతరా..? అంటే ఉండండి.. నాన్న గారు క్యాలిక్యులేటర్ తీసుకొచ్చి చెబుతా అనే రోజులు ఇవి. 20 ఎక్కాలు నోటికి  రాకుండా ఇంజనీరింగ్  పట్టా పొందిన  స్టూడెంట్స్  ఎందరో ఉన్నారు. కాలంతో పాటు మనం కూడా పరిగెత్తాలి వాస్తవమే..కానీ ప్రతి దానికి మరో వస్తువు  పై ఆధారపడడం మాత్రం అంత మంచిది కాదు.

ఇక్కడ వీళ్లను చూడండి.. పెద్ద  కాన్వెంట్ పిల్లలు కాదు, అలాగాని ఐన్ స్టీన్ కు ఉన్నంత ఐక్యూ ఉన్న పిల్లలు కాదు. కానీ ఎంత పెద్ద లెక్కలైనా చిటికెలో చిటికెన వేలుతో లెక్కపెట్టి చెప్పేస్తారు. చాతాడంత అకెంల చిట్టా చెప్పినా …తడబడకుండా పర్ ఫెక్ట్ ఆన్సర్ చేస్తారు అది కూడా మీ కాలిక్యులేటర్ కంటే  ముందే..

మీరు ప్రశ్న అడుగుతున్న సమయంలోనే వారి చేతి వేళ్ళను వారి పద్దతిలో లెక్కపెట్టుకుంటారు…. మీ ప్రశ్న అయిపోయేలోపు జవాబును చెప్పేస్తారు. ఇది మన భారతేశం మనకు సగర్వంగా అందించిన వేదిక్ మాథ్స్ లోని ఒక పార్ట్ అని చెబుతున్నారు. దీనికి చాలా ప్రాక్టీస్ అవసరం అట. ఓ సారి చూడండి పిల్లల ప్రతభ.

Watch Video: ( Wait 3 Sec For Video To Load):

 క్యాలిక్యులేటర్లు..వాళ్ళ ముందు జుజుబీ…..!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top