ఛాంపియన్స్ ట్రోఫీ సెమి ఫైనల్ కు ముందు “కోహ్లీ” ప్రెస్ మీట్ లో “అనుష్క” గురించి ఆ సంగతి చెప్తూ ఏడ్చేశాడు..!

విరాట్ – అనుష్క..ఈ జంట గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్యాచ్ అప్ అయ్యారు, తర్వాత బ్రేక్ అప్ అయ్యారు అని న్యూస్ సెన్సేషన్ అయ్యింది. కానీ ఇప్పుడు వారి మధ్య ఎలాంటి సంబంధం ఉంది అనేది పక్కన పెడితే. ఇటీవల జరిగిన యువరాజ్ సింగ్ పెళ్ళికి ఇద్దరు కలిసెల్లారు, డాన్స్ కూడా చేసారు. పబ్లిక్ గా ఎప్పుడు ఒకరిమీద ఒకరు ప్రేమ ఉందని చెప్పలేదు. కానీ చాలా మ్యాచ్ లకు అనుష్క రావడం. కోహ్లీ సెంచరీ కొట్టగానే గాల్లో ముద్దులు అందివ్వడం చాలానే చూసాము.

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బయోపిక్.. ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’ స్పెషల్ షో ఈవెంట్‌కు విరాట్, అనుష్క జోడీ హాజరై సందడి చేశారు. అయితే తనకు ఎంతో ఇష్టమైన అనుష్కతో కెప్టెన్‌గా ఎంపికయ్యానన్న శుభవార్త చెబుతూ ఏడ్చేశానని కోహ్లీ తెలిపాడు.

‘టెస్ట్ సిరీస్ సందర్భంగా ఆ సమయంలో నేను మొహాలీలో ఉన్నాను. నన్ను కలిసేందుకు అనుష్క అక్కడికి వచ్చింది. నిజంగానే ఆమె నాకు కలిసొచ్చింది. ఆమె వచ్చిన తర్వాత నేను కెప్టెన్ అయ్యాను. ఈ శుభ సందర్భాన్ని ఆమెతో పంచుకోవాలని ఫోన్ చేసి.. నన్ను కెప్టెన్ చేశారని చెప్పాను. భావోద్వేగాన్ని ఆపుకోలేక నిజంగానే ఏడ్చేశాను. ఈ రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఆశ్చర్యకరంగా నేను టెస్ట్ కెప్టెన్‌గా ఆడిన తొలిటెస్టు మెల్‌బోర్న్‌లోనూ ఆమె నాతోనే ఉందంటూ’ తీపి జ్ఞాపకాలను కోహ్లీ గుర్తుచేసుకున్నాడు.

watch video here:

ఇది ఇలా ఉండగా బాంగ్లాదేశ్ తో సెమి ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు సన్నద్ధమవుతోంది భారత జట్టు. పాకిస్తాన్ ఇంగ్లాండ్ పై విజయం సాధించి ఫైనల్ బెర్త్ కంఫర్మ్ చేసుకుంది.

Comments

comments

Share this post

scroll to top