మారుతి కంపెనీకి రూ.60వేల ఫైన్‌.! ఫ్రీ రిపేర్ చేయ‌నందుకు ఫైన్ వేసిన కంన్జ్యూమ‌ర్ కోర్ట్.!!

కారులో మీరు వెళ్తున్నారు. అనుకోకుండా భారీ వ‌ర్షం ప‌డింది. రోడ్ల‌పై నీరు వ‌చ్చి చేరింది. అలాంటి నీటి ఎదుట మీరు కారులో ఉన్నారు. అప్పుడు మీరేం చేస్తారు..? కారు పాడ‌వుతుంద‌ని చెప్పి దాంట్లో నుంచి దిగి దాన్ని అక్క‌డే వ‌దిలి నీటిలో ఈదుకుంటూ వెళ్తారా..? లేదంటే కారును నీటిలో న‌డుపుతూ వెళ్తారా..? నీరు త‌క్కువ‌గా ఉంటే ఎవ‌రైనా కారును న‌డుపుకుంటూనే వెళ్తారు క‌దా, కారును వ‌దిలి ఎలా వెళ్తారు..! అనే క‌దా మీరు అనేది. అయితే అలా కాద‌ట‌, కారును వ‌దిలిపెట్టి వెళ్లాల‌ట‌. లేదంటే నీటి వ‌ల్ల కారు ఇంజిన్ పాడైతే అది గ్యారంటీలోకి రాద‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఇది మేం చెప్పింది కాదు, కార్ల త‌యారీ సంస్థ మారుతి సుజుకి చెప్పింది. అయితే వినియోగ‌దారుల కోర్టు దీంతో ఏకీభ‌వించ‌లేదు. దీంతో ఆ కంపెనీకి రూ.60వేల ఫైన్ వేసి బాధితునికి ఆ డ‌బ్బును ఇప్పించింది. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే…

అది ఢిల్లీ. అత‌ని పేరు బ‌ల్బీర్ సింగ్‌. వ‌య‌స్సు 70 సంవ‌త్స‌రాలు. రెండు సంవ‌త్స‌రాల కింద‌ట అత‌ను మారుతి సుజికి కంపెనీకి చెందిన ఓ కారు కొన్నాడు. అయితే అత‌ను వ‌ర్షాకాలంలో ఓ రోజు రోడ్ల‌పై చేరిన నీటిలో కారును న‌డిపాడు. దీంతో కొంత దూరం వెళ్లాక కారు ఆగిపోయిది. ఈ క్ర‌మంలో కారును కంపెనీ షెడ్‌కు త‌ర‌లించాడు. అయితే కారు అప్ప‌టికి గ్యారంటీలో ఉన్నందున రిపేర్ ఫ్రీగా అవుతుంద‌ని బ‌ల్బీర్ సింగ్ భావించాడు. కానీ కంపెనీ ఏం చెప్పిందంటే.. కారును నిర్ల‌క్ష్యంగా నీటిలో న‌డిపినందున దాని ఇంజిన్‌లో నీరు చేరింద‌ని, క‌నుక గ్యారంటీ క‌వ‌ర్ కాద‌ని, డ‌బ్బులు క‌ట్టి రిపేర్ చేయించుకోవాల‌ని మారుతి కంపెనీ చెప్పింది. దీంతో బ‌ల్బీర్ సింగ్ క‌న్‌జ్యూమ‌ర్ కోర్టును ఆశ్ర‌యించాడు.

అయితే క‌న్‌జ్యూమ‌ర్ కోర్టులో మారుతీ కంపెనీ వితండ వాదం చేసింది. స‌ద‌రు వ్య‌క్తి కారును నిర్ల‌క్ష్యంగా నీటిలో న‌డిపాడ‌ని, అందువ‌ల్ల ఇంజిన్‌లో నీరు చేరింద‌ని, క‌నుక త‌మ ష‌ర‌తుల ప్ర‌కారం గ్యారంటీ కారుకు వ‌ర్తించ‌ద‌ని, అదే అత‌నికి చెప్పామ‌ని మారుతీ ప్ర‌తినిధులు వెల్ల‌డించారు. అయితే నిజానికి గ్యారంటీ ష‌రతుల జాబితాలో కంపెనీ చెప్పిన‌ట్టుగా కారును నీటిలో న‌డ‌ప‌కూడ‌ద‌ని ఎక్క‌డా లేదు. మ‌రి అలాంట‌ప్పుడు గ్యారంటీ వ‌ర్తిస్తుంది క‌దా, కాబ‌ట్టి బాధితునికి క‌చ్చితంగా గ్యారంటీ కింద ఉచితంగా రిపేర్ చేయాల్సిందే అని కోర్టు భావించింది. దీంతో బాధితునికి న్యాయం జ‌రిగేలా కోర్టు తీర్పునిచ్చింది. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించినందుకు గాను మారుతి కంపెనీకి రూ.50వేల‌ను, ఖ‌ర్చుల కింద మ‌రో రూ.10వేల‌ను మొత్తం క‌లిపి రూ.60వేల‌ను బాధితునికి చెల్లించాల‌ని తీర్పునిచ్చింది. అంతే కాదు, నెల రోజుల్లో కారును ఉచితంగా రిపేర్ చేసి బ‌ల్బీర్‌కు అందించాల‌ని కోర్టు ఆదేశించింది. అవును మ‌రి, కార్పొరేట్ కంపెనీలు అంటే అంతే క‌దా. ఏది ఏమైనా బాధితునికి న్యాయం జ‌రగ‌డం హ‌ర్షించ‌ద‌గిన ప‌రిణామం.

Comments

comments

Share this post

scroll to top