ఫిబ్రవరి నెలంతా పెళ్లిళ్ల జాతరే, ఆ నాలుగు రోజుల్లో వేలాది పెళ్లిళ్లు..!

పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది ఆజామూ.. ఇక ఈ నెల కేటరింగ్ వాళ్ళకి, ఫంక్షన్ హాల్స్ కి, ఈవెంట్స్ మేనేజ్ చేసే వాళ్ళకి పండగే పండగే, అసలు పండగ చేసుకునేది పెళ్లి చేసుకునేవాళ్ళు, డిసెంబర్ 30 తో మంచి ముహుర్తాలు అయిపోయాయి, వివాహాది శుభకార్యాలకు మాఘమాసం వచ్చే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి.

మాఘమాసం వచ్చిందండోయ్.. :

ఇక మాఘమాసం రావడం తో పెళ్లి చేసుకోవాలి అనే వారి ముఖాలు వెలిగిపోతున్నాయి, ఫంక్షన్ హాల్స్ అన్ని హౌస్ ఫుల్, పొలాల్లో పందిరి వేసి, లేదా ఇంటి దెగ్గరే పందిరి వేసి పెళ్లిళ్లు జరిపించేస్తారు. ఎందుకంటే మాఘమాసం లో మంచి గడియలు, బలమైన గడియలు ఉండటమే కారణం.

నాలుగు రోజులు జాతరే.. :

8,9,10,11 తారీఖులు అత్యంత మంచి రోజులు అని, వివాహాది శుభకార్యాలకు ఈ రోజుల్లో బాగుంటుందని పంతుళ్లు చెప్పడం తో ఈ 4 రోజుల్లో భారీ నుండి అతి భారీ పెళ్లిళ్లు జరగనున్నాయి, వేలాది జంటలకు ఈ 4 రోజుల్లోనే వివాహం జరగనుంది, ఈ నాలుగు రోజులు ఫంక్షన్ హాల్స్ వాళ్ళకి, కేటరింగ్ వాళ్ళకి, ఈవెంట్ మ్యానేజ్మెంట్ వాళ్ళకి ఫుల్ గిరాకీ అని చెప్పొచ్చు.

మిగిలిన రోజుల్లో కూడా.. :

8,9,10,11 రోజుల్లోనే కాదు, ఈ నెల అయిపోయేంత వరకు మంచి రోజులు ఉన్నాయ్ అని పంతుళ్లు చెబుతున్నారు. ఫిబ్రవరి 10న శ్రీ పంచమి, 12న రథసప్తమి, 16న భీష్మ ఏకాదశి, ఆపై మార్చి 4న మహా శివరాత్రి పర్వదినాలు కూడా మాఘమాసంలో ఉన్నాయి. ఈ పర్వదినాల్లో మంచి ముహుర్తాలు ఉన్నాయ్.

ఫిబ్రవరి, మార్చి నెలల్లో వివాహాది శుభకార్యాలకు అనువుగా ఉన్న కొన్ని రోజులు ఇవే.. :

ఫిబ్రవరి నెలలో :

 • ఫిబ్రవరి 8, 2019, శుక్రవారం, చతుర్థి తిథి, మరియు ఉత్తరాబాద్ర నక్షత్రం.
 • ఫిబ్రవరి 10, 2019, ఆదివారం, పంచమి తిథి, మరియు ఉత్తరాభాద్ర & రేవతి నక్షత్రం.
 • ఫిబ్రవరి 15, 2019, శుక్రవారము, దశమి – ఏకదశి తిథులు, మరియు మృగశిరా నక్షత్రం.
 • ఫిబ్రవరి 21 , 2019, గురువారం, విదియ – తదియ తిథులు, మరియు మృగశిర నక్షత్రం.
 • ఫిబ్రవరి 23, 2019, శనివారం, పంచమి తిథి మరియు స్వాతి నక్షత్రం.
 • ఫిబ్రవరి 24, 2019, ఆదివారం, షష్టి తిథి మరియు స్వాతి నక్షత్రం.
 • ఫిబ్రవరి 26, 2019, మంగళవారం, అష్టమి తిథి, మరియు అనురాధా నక్షత్రం.
 • ఫిబ్రవరి 28, 2019, గురువారం, దశమి తిథి మరియు మూలా నక్షత్రం.

మార్చి నెలలో :

 • మార్చి 2 , 2019, శనివారం, ద్వాదశి తిథి మరియు ఉత్తరాషాడ నక్షత్రం.
 • మార్చి 7, 2019, గురువారం, పాడ్యమి – విదియ తిథులు, మరియు ఉత్తరాబాద్ర నక్షత్రం.
 • మార్చి 8, 2019, శుక్రవారం, విదియ – తదియ తిథులు మరియు ఉత్తరాభాద్ర & రేవతి నక్షత్రాలు.
 • మార్చి 9, 2019, శనివారం, తదియ తిథి మరియు రేవతి నక్షత్రం.
 • మార్చి 13, 2019, బుధవారం, సప్తమి తిథి, మరియు రోహిణి నక్షత్రం.

 

Comments

comments

Share this post

scroll to top