SHOCKING: “విరాట్ కోహ్లీ” కి మళ్లీ పెళ్లి అంట..! కారణం ఏంటో తెలుసా.? ఇంతకీ ఎవరితో.?

విరాట్‌ కోహ్లి.. అనుష్క శర్మ.. గత కొంత కాలంగా వార్తల్లో నిలిచిన జంట ఇది. టీమిండియా, శ్రీలంక మ్యాచ్‌లు జరుగుతున్న సందర్భంగా కోహ్లి అర్థాంతరంగా సెలవుపై వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి లోను చేసింది. ఓ దశలో కోహ్లి పెళ్లి కోసమే సెలవు పెట్టాడు అన్న వార్తలు వచ్చాయి. కానీ ఆ జంట పెళ్లి వార్తలను ఖండించింది. అయితే చివరకు వారిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో ఇటలీలో ఘనంగా పెళ్లి చేసుకుని అందరికీ షాక్‌ ఇచ్చారు. తరువాత ఇండియాలో ఢిల్లీ, ముంబైలలో గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఏర్పాటు చేయగా, ఆ పార్టీలకు బాలీవుడ్‌, క్రికెట్‌ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇక అక్కడితో ఆ తంతు ముగిసింది.

అయితే ఇప్పుడు కోహ్లి సౌతాఫ్రికాలో ఉన్నాడు. ఆ దేశంలో జరుగుతున్న మ్యాచ్‌లలో ఆడుతున్నాడు. ఇక అనుష్క కూడా కొద్ది రోజులు సౌతాఫ్రికాలో ఉండి చివరకు ఇండియాకు తిరిగి వచ్చి ఇక్కడ యథావిధిగా సినిమా షూటింగ్‌లలో పాల్గొంటోంది. అయితే ఇప్పుడు మళ్లీ ఈ జంట వార్తల్లో నిలిచింది. దాని ప్రకారం.. ఇప్పుడు విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మలు మళ్లీ పెళ్లి చేసుకోనున్నారని తెలిసింది. అవును, మీరు విన్నది నిజమే. ఎందుకంటే…

విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మలు పెళ్లి చేసుకున్నది ఇటలీలో. కానీ వారికి మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ కావాలంటే వారు ఇండియాలోనే పెళ్లి చేసుకుని ఉండాలి. అలా ఉంటేనే వారికి వివాహ ధృవీకరణ పత్రం ఇస్తారు. కానీ వారు పెళ్లి చేసుకుంది ఇటలీలో కనుక ఇప్పుడు వారికి మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ వచ్చే అవకాశం లేదు. కనుకనే వారు మళ్లీ పెళ్లి చేసుకోనున్నారట. అలా చేసుకుంటేనే వారికి మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ వస్తుంది. మరి.. ఇక వారు మళ్లీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో.. వేచి చూడాలి. అయినా బాగా సౌండ్‌ పార్టీలు కదా.. ఎన్ని సార్లు అయినా పెళ్లి చేసుకుంటారు, ఎన్ని రిసెప్షన్‌లు అయినా పెట్టుకుంటారు. మధ్యలో బకరాలం అయ్యేది మనమే. అవునంటారా.. కాదంటారా..!

Comments

comments

Share this post

scroll to top