సినిమాను పొగుడుతున్నారు..కానీ ఫేస్ బుక్ లో వర్మ చేసిన ఆ పోస్ట్ ని మాత్రం తిడ్తున్నారు.! ఎందుకు?

రాంగోపాల్ వర్మ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు..ఆయన ఏం మాట్లాడకపోతే వింత కానీ,ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేస్తే  అందులో వింతేముంది అంటారా..అదీ నిజమే..పాజిటివ్ గానో,నెగటివ్ గానో ఎప్పుడూ జనాల నోళ్లలో నానాలనుకునే వ్యక్తుల్లో వర్మ కి ప్రధమస్థానం ఇవ్వొచ్చు.తీసే సినిమా హిట్టో ఫట్టో కానీ సినిమాకి ముందు మాత్రం వచ్చే కాంట్రవర్సీలు అన్నీ ఇన్ని కావు.వివాదాల నడుమే వర్మ జిఎస్టీ రిలీజైంది.ఇంతలో మరో కాంట్రవర్సీ ఇష్యూ తెరమీదికొచ్చింది..

నిజానికి ‘జీఎస్‌టీ'(గాడ్,సెక్స్&ట్రూత్) జనవరి 26న విడుదల కావాల్సి ఉన్నా.. విపరీతమైన ట్రాఫిక్ కారణంగా సైట్ క్రాష్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది గాడ్,సెక్స్&ట్రూత్ సైట్ పైనే ఉండటంతో.. ఆ ట్రాఫిక్‌ను తట్టుకోలేక సైట్ ఓపెన్ అవలేదు.ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని ‘జీఎస్‌టీ’ ప్రొడ్యూసర్స్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ను పరిష్కరించి సైట్‌ను అప్‌గ్రేడ్ చేశారని, జనవరి 27వ తేదీ ఉదయం 9గం.కు దీన్ని విడుదల చేస్తామని ప్రకటించారు. సినిమా వాయిదా పడ్డందుకు చింతిస్తున్నట్లు తెలిపారు. గాడ్,సెక్స్&ట్రూత్ కు ఇంతటి అనూహ్య స్పందన రావడంతో వర్మ ఫుల్ ఖుషీగా  ట్విట్టర్‌లో ఒక కామెంట్  చేశాడు వర్మ. ‘జీఎస్‌టీ’కి వస్తున్న ట్రాఫిక్ ను చూసి.. ఇండియాలో చాలామంది దీపికా పదుకొణే కంటే మియా మాల్కోవాను చూడటానికే ఎక్కువ ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు. అంతేకాదు, ‘సత్యమేవా జయతే’ను కాస్త ‘సత్యమియా జయతే’గా మార్చేశాడు. వర్మ చేసిన ఈ కామెంట్‌తో ఇప్పుడు మరో వివాదం మొదలైంది.

దీపికా నటించిన  పద్మావత్, ‘జీఎస్‌టీ’ రెండూ ఒకేరోజు విడుదల కావడంతో.. దీపికాను, మియాను పోల్చి కామెంట్ చేయడంలో తప్పులేదు కానీ.. మధ్యలో ‘సత్యమియా జయతే’ అంటూ కామెంట్ చేయాల్సిన అవసరమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు..సినిమా ప్రమోషన్ కోసం ఏది పడితే అది వాడడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top