విడాకుల కోసం భర్తను బంధించి, 29 గంటలపాటు అత్యాచారం చేసిందంట!?

దక్షిణ కొరియా పోలీస్ స్టేషన్ కు ఓ వ్యక్తి వెళ్ళి చేసిన పిర్యాదు ఇది. నాభార్య నన్ను 29 గంటల పాటు గదిలో బంధించి నాపై అత్యాచారాన్ని చేసింది అని ఆ కంప్లైంట్ సారాశం. మనదగ్గరైతే  భార్యాభర్తల మద్య జరిగేది ఎటువంటి శృంగారాన్నైనా…? సంసారంగా పేర్కొంటారు. కానీ  అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దక్షిణ కొరియా లాంటి దేశాల్లో అది చెల్లదు.ఇద్దరు ఇష్టపూర్తిగా రతిలో పాల్గొంటే ఓకే, కానీ  బలవంతంగా భర్త భార్యతో రమించాలని చూసిన, భార్య భర్తను బలవంతపెట్టిన అతి వైవాహిక అత్యాచారం కిందే లెక్క.

ఇప్పుడు ఇదే లెక్కతో ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ తలుపుతట్టాడు. వైవాహిక అత్యాచారం చెయ్యడం నేరం అంటూ 2013వ సంవత్సరంలో దక్షిణ కొరియా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత ఓ మహిళ మీద ఇలాంటి కేసు నమోదు కావడం ఇదే మొదటి సారి అని అక్కడి పోలీసులు అంటున్నారు. విడాకులు తీసుకోవడానికి గట్టి సాక్షం కావాలనే ఉద్దేశంతోనే ఆమె ఈ నేరం చేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.  ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ప్రపంచంలోని 104 దేశాలలో వైవాహిక అత్యాచారం చెయ్యడం నేరం అని నిర్దారించి అలాంటి కేసులను కోర్టులు విచారించడానికి ఆ దేశాలలోని ప్రభుత్వాలు అంగీకరించాయి.

ఇక్కడ మనం గ్రహించాల్సింది…భర్తపై భార్య రేప్ అనే విషయం కంటే కూడా వైవాహిక అత్యాచారం గురించి ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది.! ఎందుకంటే సంసారం పేరుతో భార్యలను బలవంతంగా హింసుస్తున్న వారి సంఖ్య మనదేశంలో చాలా ఎక్కువ అనే సర్వేలు తేల్చాయి.

 Video On Marital Rape Issue: 

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top