షమీ మరొక వాట్సాప్ చాట్ లీక్..! గర్ల్ ఫ్రెండ్ తో ఎలా మాట్లాడాడో చూడండి అంటూ “హసీన్” ఫేస్బుక్ లో పోస్ట్.!

టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ మరోసారి తన భర్తకు సంబంధించిన ఆధారాలను తాజాగా బయటపెట్టింది. మంజు మిశ్రా అనే యువతితో షమీ ఛాటింగ్ చేసిన మెసేజ్‌ల స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. షమీకి చాలా మంది మహిళలతో వివాహేతర సంబంధాలున్నాయని హాసిన్ గతంలోనే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.లండ‌న్‌కు చెందిన బిజినెస్‌మ్యాన్ మ‌హ్మ‌ద్ భాయ్.. క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీకి అమ్మాయిల‌ను ప‌రిచ‌యం చేసేవాడ‌ని, మంజు మిశ్రా అనే ఇంకో అమ్మాయితో ష‌మీ అక్ర‌మ‌ సంబంధాలు క‌లిగి ఉన్నాడ‌ని వెల్ల‌డించింది. ఈ సందర్భంగా మంజుకు సంబంధించిన ఫేస్‌బుక్ ఛాటింగ్ ఫొటోలను కూడా విడుదల చేసింది. తనను షమీతో పాటు అతని కుటుంబ సభ్యులు వేధించారని కోల్‌కతా పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు కూడా ప్రారంభించారు. షమీపై ఫిక్సింగ్ ఆరోపణలు చేయడంతో బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం కూడా విచారణ జరుపుతోంది.

Comments

comments

Share this post

scroll to top