ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌ మర్చిపోయారా..? అయితే సింపుల్ గా 3 స్టెప్స్ ఫాలో అవ్వండి.!

నోట్ల రద్దు పుణ్యమా అని దేశంలో డిజిటల్‌ లావాదేవీలు పెరిగిపోయాయి. ఎవరిని చూసినా వాలెట్లతోపాటు మొబైల్‌, నెట్‌ బ్యాంకింగ్‌ లను ఎక్కువగా వాడుతున్నారు. అయితే వాలెట్లు, మొబైల్‌ బ్యాంకింగ్‌లలో పాస్‌వర్డ్‌లను మరిచిపోతే సులభంగానే సెట్‌ చేసుకోవచ్చు. కానీ నెట్‌ బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌ను మరచిపోతే దాన్ని సెట్‌ చేసుకోవడం చాలా మందికి ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలోనే ఎస్‌బీఐ బ్యాంక్‌కు చెందిన ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌ను మరిచిపోతే దాన్ని ఎలా రీసెట్‌ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా https://www.onlinesbi.com వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అక్కడ ఉండే LOGIN బటన్‌ను ప్రెస్‌ చేయాలి. అనంతరం వచ్చే విండోలో కంటిన్యూ లాగిన్‌ బటన్‌ను ప్రెస్‌ చేయాలి. తరువాత మళ్లీ విండో ప్రత్యక్షమవుతుంది. అందులో Forgot Login Password అనే బటన్‌ ను ప్రెస్‌ చేయాలి. తరువాత వచ్చే విండోలో నెక్ట్స్‌ బటన్‌ను ప్రెస్‌ చేయాలి. అనంతరం మళ్లీ ఒక విండో ఓపెన్‌ అవుతుంది. అందులో మీ యూజర్‌నేమ్‌, అకౌంట్‌ నంబర్‌, కంట్రీ, మొబైల్‌ నంబర్‌, డేటాఫ్‌ బర్త్‌లను ఎంటర్‌ చేసి కాప్చా బాక్స్‌లో కాప్చా ఎంటర్‌ చేయాలి. అనంతరం కింద ఉండే సబ్‌మిట్‌ నొక్కాలి. తరువాత స్క్రీన్‌లో మీ మొబైల్‌ నంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌ నొక్కాలి. దీంతో కొత్త విండో ఓపెన్‌ అవుతుంది. అనంతరం అందులో ఉండే ఆప్షన్లలో మొదటి ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఏటీఎం కార్డ్‌ డిటెయిల్స్‌తో నెట్‌ బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చన్నమాట. అలా ఆ స్క్రీన్‌లో మొదటి ఆప్షన్‌ను ఎంచుకున్నాక కింద ఉండే సబ్‌మిట్‌ను ప్రెస్‌ చేస్తే మళ్లీ వచ్చే స్క్రీన్‌లో మీ ఏటీఎం కార్డు నంబర్‌, డేట్‌, పేరు, ఏటీఎం పిన్‌, కాప్చా వంటి వివరాలను ఎంటర్‌ చేసి కన్‌ఫాం చేయాలి. అనంతరం కొత్త లాగిన్‌ పాస్‌వర్డ్‌ సెట్‌ చేసుకోమంటూ మరో విండో ప్రత్యక్షమవుతుంది. అందులో మీరు మళ్లీ మీ నెట్‌ బ్యాంకింగ్‌కు కొత్తగా లాగిన్‌ పాస్‌వర్డ్‌ సెట్‌ చేసుకోవచ్చు. ఇలా మీరు మీ ఎస్‌బీఐ నెట్‌ బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌ను రీసెట్‌ చేసుకోవచ్చు.

అయితే ఏటీఎం కార్డు వివరాలకు ముందు వచ్చే స్క్రీన్‌లో ఉండే రెండో ఆప్షన్‌ను ఎంచుకుంటే ప్రొఫైల్‌ పాస్‌వర్డ్‌తో కూడా నెట్‌ బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌ను రీసెట్‌ చేసుకోవచ్చు. అందుకు యూజింగ్‌ ప్రొఫైల్‌ పాస్‌వర్డ్‌ అనే ఆప్షన్‌ను ఎంచుకుని ముందుకు వెళితే వచ్చే విండోలో మీ నెట్‌బ్యాంకింగ్‌ ప్రొఫైల్‌ పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేసి కన్ ఫాం చేయాలి. అనంతరం వచ్చే స్క్రీన్‌లో మీ నెట్‌ బ్యాంకింగ్‌కు గాను కొత్త లాగిన్‌ పాస్‌వర్డ్‌ను సెట్‌ చేసుకోవచ్చు. అయితే మీ వద్ద ఏటీఎం లేకపోయినా, ప్రొఫైల్‌ పాస్‌వర్డ్‌ గుర్తుండకపోయినా, అప్పుడు కార్డు వివరాలను ఎంటర్‌ చేయడానికి ముందు వచ్చే స్క్రీన్‌లో ఉండే మూడో ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీంతో మీకు మీ నెట్‌బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌ (కొత్తది) పోస్ట్‌లో వస్తుంది. ఇలా మూడు రకాలుగా మీరు మీ ఎస్‌బీఐ నెట్‌ బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌ను రీసెట్‌ చేసుకోవచ్చు.

Comments

comments

Share this post

scroll to top