“ఆది” సరికొత్త పాత్రలో నటించిన “మరకతమని” సినిమా ఎలా ఉందో తెలుసా..? హిట్టా..?

Movie Title (చిత్రం): మ‌ర‌క‌త‌మ‌ణి (Marakathamani)

Cast & Crew:

 • నటీనటులు: ఆది పినిశెట్టి, నిక్కీ గ‌ల్రాని, కోట శ్రీనివాస‌రావు, బ్ర‌హ్మ‌నందం, ఆనంద్ రాజ్‌, అరుణ్ రాజ్‌, కామ‌రాజ్‌, రామ్‌దాస్ త‌దిత‌రులు.
 • సంగీతం: దిబు నైన‌న్ థామ‌స్‌
 • నిర్మాత: రిషి మీడియా (శ్రీ చ‌క్ర ఇన్నోవేష‌న్స్‌ )
 • దర్శకత్వం: ఎఆర్కే శ‌ర‌వ‌ణ‌న్‌

Story:

రఘునందన్ (ఆది పినిశెట్టి) అప్పుల బాధ‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతుంటాడు. అప్పులు తీర్చడానికి పట్నం కి వచ్చి స్నేహితుడితో కలిసి స్మగ్లింగ్ చేస్తుంటాడు. సడన్ గా ర‌ఘునంద‌న్‌కి రూ. 10 కోట్ల ఆఫ‌ర్ వ‌స్తుంది. మ‌ర‌క‌త‌మ‌ణి అనే ఓ అరుదైన ఆభ‌ర‌ణం తెచ్చిస్తే రూ.ప‌ది కోట్లు ఇస్తామ‌ని చైనాకి చెందిన ఓ వ్యాపారి ఆఫ‌ర్ ఇస్తాడు. అయితే మ‌ర‌క‌త‌మ‌ణిని ఎవ‌రు తాకితే వాళ్లు ప్రాణాలు కోల్పోతుంటారు. మ‌ర‌క‌త‌మ‌ణిని తాకిన వారిని ఓ పురాత‌న వాహ‌నం ఢీ కొట్టి చంపేస్తుంది. అలా అప్ప‌టిదాకా 132 మంది ప్రాణాలు కోల్పోయుంటారు. అందుకే ఆ ఆభ‌ర‌ణం జోలికి ఎవ్వ‌రూ వెళ్ల‌రు. కానీ ర‌ఘునంద‌న్ మాత్రం తాను తెచ్చిస్తాన‌ని ఒప్పందం కుదుర్చుకొంటాడు. మరి తెచ్చివ్వగలిగాడా..? అస‌లు మ‌ర‌క‌త‌మ‌ణి వెన‌క క‌థేమిటి? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Review:

ఇప్పటివరకు సీరియస్ పత్రాలు చేసిన ఆది, ఈ సినిమాలో కామెడీ చేస్తాడు. పాత్ర‌కి త‌గ్గ‌ట్టుగా చ‌క్క‌టి అభిన‌యాన్ని ప్ర‌ద‌ర్శించాడు. డాన్ ట్వింకిల్ రామ‌నాథం పాత్ర‌లో ఆనంద్ రాజ్ అభిన‌యం ఆక‌ట్టుకుంటుంది. చేసింది డాన్ పాత్రే అయినా, ఆయ‌న క‌నిపించిన ప్ర‌తిసారీ న‌వ్వులు పండుతాయి. నిక్కీ గ‌ల్రానీ, మైమ్ గోపీ, రాందాస్ పాత్ర‌లు కూడా సినిమాకి కీల‌కం. టెక్నికల్ గా కూడా సినిమాకి మంచి స్పందనే వచ్చింది. దిబు నైన‌న్ థామ‌స్ సంగీతం, పి.వి.శంక‌ర్ కెమెరా ప‌నిత‌నం చాలా బాగుంది. దర్శకుడు అనుకున్నది అనుకున్నట్టు తెరకు లెక్కించడంలో సక్సెస్ అయ్యారు!

Plus Points:

 • క‌థ‌నం
 • న‌టీన‌టులు
 • సంగీతం
 • ఛాయాగ్ర‌హ‌ణం

Minus Points:

 • స్లో స్క్రీన్ ప్లే
 • హీరో – హీరోయిన్ల మధ్య సన్నివేశాలు లేవు
 • తమిళ్ నేటివిటీ

Final Verdict:

మరకతమని సినిమా బాగుంది. ఎక్కడ బోర్ కొట్టాడు. సినిమా చూసినంత సేపు నెక్స్ట్ ఏమవుతుంది అని చూస్తారు.

AP2TG Rating: 2/5

Trailer:

Comments

comments

Share this post

scroll to top