Cast & Crew:
- హీరో, హీరోయిన్ః మోహన్‌లాల్.. కమలినీ ముఖర్జీ
- కథనం: ఉదయ్‌కృష్ణ
- సంగీతం: గోపీసుందర్
- దర్శకత్వం: వైశాక్
- నిర్మాత: సిందూరపువ్వు కృష్ణారెడ్డి
Story:
ఓ గిరిజన ప్రాంతానికి చెందిన వ్యక్తి పులి కుమార్ (మోహన్‌లాల్)., అతని కళ్లెదుటే అతని తండ్రిని ఓ పులి తినేస్తుంది. తల్లి కూడా మరణించడంతో…తమ్ముడిని అన్ని తానై పెంచుతుంటాడు పులికుమార్. తన తండ్రిని చంపిందన్న కోపంతో చిన్న వయసులోనే ఆ పులిని మట్టుబెడతాడు. ఆ తర్వాత తనుంటున్న పులియూరుకి పులుల బెడద లేకుండా కాపాడుతుంటాడు. తన తమ్ముడికి ఉద్యోగం కోసం డాడీ గిరిజ ( జగపతిబాబు )ను సంప్రదిస్తాడు. అందుకోసం డాడీ గిరిజ అడవిలోని గంజాయిని ఆయుర్వేద మందుల కోసం తీసుకురమ్మనడంతో ఆ పని చేస్తాడు పులికుమార్. అయితే అది ఆయుర్వేద మందు కాదని మత్తు మందని తెలుసుకుంటాడు పులికుమార్…. ఆ తరువాత ఏం జరిగింది.. పులికుమార్ డాడీ గిరిజ కంపెనీని అడ్డుకున్నాడా..?పులి కుమార్కీ మైనా (కమలినీ ముఖర్జీ).. జూలీ (నమిత)లకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి.? లాంటి విషయాలు చూడాలంటే వెండితెర మీద చూడాల్సిందే.
Plus Points:
- మోహన్ లాల్, జగపతి బాబు నటన
- యాక్షన్ సన్నివేశాలు
- కెమెరా
- నేపథ్య సంగీతం
Minus Points:
- పాత కథ
- వచ్చే సన్నివేశాలు ముందే తెలిసిపోవడం
Verdict:
మాస్ మెచ్చిన మన్యం పులి
Rating: 2.5/5
Trailer