సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న మ‌నుస్మృతి లోని 2 పేజీలు.! చ‌ర్చ V/S ర‌చ్చ‌.

యాక్ష‌న్-రియాక్ష‌న్ …ఈ చ‌ర్య‌లు సోష‌ల్ మీడియాలో స‌ర్వ‌సాధార‌ణం. కేర‌ళ‌లో అయ్య‌ప్ప గుడిలోకి మ‌హిళ‌లు కూడా హజ‌ర‌వ్వొచ్చు అని సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పును వ్య‌తిరేఖిస్తూ కేర‌ళ‌లో ర్యాలీలు , ధ‌ర్నాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో….. మ‌హిళ‌లు గుడిలోకి ఎందుకు వెళ్ల‌కూడ‌దు..అనే చ‌ర్చ స్టార్ట్ అయ్యింది. ఈ చ‌ర్చ మ‌నుస్మృతి మీద‌కు వెళ్లింది. మ‌నుస్మృతిలో మ‌హిళ‌ల‌ను ఆట‌వ‌స్తులుగా చూపించారు…ఇంకా మ‌న‌వాళ్లు దాన్నే ఫాలో అవుతున్నారు. ఇక్క‌డే అస‌లు లోపం అంటూ సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయు. ఈ సంద‌ర్భంగా మ‌నుస్మృతి లోని 2 పేజీలు సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌న‌మిచ్చాయి.

ఈ రెండు పేజీల్లో మ‌హిళ‌ల‌ను ఉద్దేశించి కొన్ని అభ్యంత‌రక‌ర వ్యాఖ్య‌లు అందులో క‌నిపించాయి. ఇప్పుడు సామాజిక మాద్య‌మాల్లో దీని మీద చ‌ర్చ జ‌రుగుతుంది.

వ‌ర్గం-1
1) స్త్రీల‌కు ఎదుటివారి వ‌య‌స్సుతో, అందంతో ప‌నిలేదు, అనుభ‌వించ‌డానికి పురుషుడైతే చాలు.
2) స్త్రీల‌కు స‌హ‌జంగానే వ్య‌భిచార మ‌న‌స్త‌త్వం ఉంటుంది.
3) పిల్ల‌ల్ని క‌న‌డంలో…అంతా పురుషుల మ‌హిమే అని చెప్ప‌డం.
ఇలాంటి స్త్రీల‌ను కించ‌ప‌రిచే అనేక అంశాలు…మ‌నుస్మృతి ఉన్నాయ‌ని చెబుతూ ఓ వ‌ర్గం వారి వాద‌న‌.

వ‌ర్గం-2.
మనుస్మృతి అన్నది సంస్కృతం లో రాసి ఉన్నది మూలం చదివి అందులోని పదాలను అర్థ తాత్పర్య వ్యాఖ్యానాలను రహస్య కథాకథన విధానాన్ని అర్థం చేసుకొని వ్యాఖ్యానిస్తే అది స‌రైన‌ద‌వుతుంది. ఎవడో రాసిన అనువాదాన్ని చదివితే కాదు. అని మ‌రో వ‌ర్గం వారి వాధ‌న‌.

మొత్తానికి….ఈ రెండు పేజీలు సోష‌ల్ మీడియాలో మాత్రం పెద్ద చ‌ర్చ‌ను లేవ‌నెత్తాయి.!

Comments

comments

Share this post

scroll to top