మనుషులే కాదు జంతుకలు కూడా స్నేహంకోసం ఏమైనా చేస్తాయి అనడానికి రుజువే ఈ శునకం కథ..ఉక్రైన్‌ లో జరిగిన నిజమైన సంఘటన!!

ఆడ శునకం ని కాపాడటం కోసం ప్రాణాన్ని త్యాగం చెయ్యడానికి కూడా సిద్ధపడింది మగ శునకం. వివరాల్లోకెళితే ఉక్రైన్‌ లో ఒక పక్క మంచు దట్టం గా కురుస్తుంది, చల్లటి గాలి, తినడానికి ఆహరం లేదు ఒళ్ళంతా గాయాలతో ట్రాక్ పైనే పడుకుంది ఆడ శునకం, ఆడ శునకాన్ని చూసిన మగ శునకం దానికి ఆహరం తెచ్చి పెట్టింది, దాని వెన్నంటే ఉంది.

ఒకే కుటుంబం :

ఆడ శునకం, మగ శునకం ఒకే కుటుంబానికి చెందినవి, ట్రాక్ పైన పడుకున్న ఆడ శునకాన్ని బయటకు తెచ్చేందుకు మగ శునకం ప్రయత్నించింది, కానీ ట్రైన్ వస్తున్నా కదలకపోడం తో ఆడ శునకం తో పాటు కలిసి ట్రాక్ మీద కూర్చుంది మగ శునకం.

అదృష్టవశాత్తు :

అదృష్టవశాత్తు అవి రెండు ప్రాణాలతో బయట పడ్డాయి, రెండిటికి చికిత్స అందించారు, మగ శునకం ఆడ శునకం ఆరోగ్యం గానే ఉన్నాయ్ ప్రస్తుతం. ట్రాక్‌పైన కుక్కల పరిస్థితిని డెనీస్‌ అనే వ్యక్తి వీడియో తీసి నెట్‌లో పెట్టాడు. ఈ వీడియో నెట్‌లో వైరల్‌ అయ్యింది, వీటి మధ్య ఉన్న స్నేహం ఎంతో మందికి స్ఫూర్తి దాయకం కానుంది. స్నేహం కోసం చావడానికి కూడా సిద్ధ పడే వారు ఉంటారని నిరూపితమయ్యింది, మనుషులే కాదు జంతువులు కూడా స్నేహం కోసం ప్రాణం ఇవ్వడానికి వెనకాడవు అని అర్థమైంది.

స్నేహితుల్లో ఒకరినినొకరు చంపుకొనే వాళ్ళు ఉంటారుకాని చచ్చే వాళ్ళు ఉంటారా.?

చాలా మంది అనుకోవచ్చు, స్నేహం కోసం ఎవరైనా చస్తారా అని, కానీ స్నేహితుల ప్రేమను గెలిపియ్యటం కోసం ఎందరో చనిపోయారు, ఆప్త మిత్రుడు మరణిస్తే ఆ బాధను తట్టుకోలేక మరణించారు, స్నేహం అంటే చెడే లేదు మంచి కూడా ఉంటుంది.

 

Comments

comments

Share this post

scroll to top